Share News

Tummala: పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ పూర్తి చేయాలి: తుమ్మల

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:42 AM

పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై చేపట్టిన విజిలెన్స్‌ విచారణను సత్వరమే పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

Tummala: పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ పూర్తి చేయాలి: తుమ్మల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై చేపట్టిన విజిలెన్స్‌ విచారణను సత్వరమే పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్లలో జరిగే ఎలాంటి అక్రమాలను ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భరంగా మాట్లాడుతూ.. అక్రమాలు ఎలా జరిగాయి? అనే అంశంపై వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులను పిలిపించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో విజిలెన్స్‌ విచారణ చేపడుతున్నారని తెలిపారు. విజిలెన్స్‌ ఇచ్చే విచారణ నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Apr 26 , 2025 | 04:42 AM