Sridhar Babu: దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసు.. బీఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్..
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:02 PM
దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసని, అధికారంలేదన్న అసహనంతో కేబినెట్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలపై తెలంగాణ రాష్ట్ర మంతి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసని, అధికారంలేదన్న అసహనంతో కేబినెట్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత పాలనా వైఫల్యాలను దాచేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిపారు (TS Minister slams BRS).
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులందరిదీ ఒకటే జెండా, ఒకటే అజెండా అని, గత 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. తమ పాలన అభివృద్ధే లక్ష్యంగా నడుస్తుందని, ఎలీ లిల్లీ లాంటి అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు రావడం తమ కృషికి నిదర్శనమని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల్ని కప్పిపుచ్చుకోవడానికి తమపై బురద చల్లడం మానాలని హితవు పలికారు (BRS vs Congress).
విజ్ఞులైన ప్రజలు మీ మైండ్ గేమ్‌లను నమ్మరని గుర్తుంచుకోవాలని, రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని బీఆర్‌ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో రూ.12, 864 కోట్ల ఎఫ్‌డీఐలు తెలంగాణకు వచ్చాయన్నారు. 33 శాతం పెరుగుదలతో దేశంలో టాప్ 3 అర్బన్ ఎఫ్‌డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఉందని తెలిపారు. పరిశ్రమల జీఎస్‌వీఏ రూ.2.77 లక్షల కోట్లకు పెరిగిందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ
Read Latest Telangana News And Telugu News