Share News

Yadagirigutta: యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్‌ ధర పెంపు

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:51 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సత్యదేవుడి వ్రత టికెట్‌ ధర పెరిగింది.

Yadagirigutta: యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్‌ ధర పెంపు

యాదగిరిగుట్ట, జూలై 25 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సత్యదేవుడి వ్రత టికెట్‌ ధర పెరిగింది. గతంలో రూ.800 ఉండగా, శుక్రవారం నుంచి కొత్త ధర రూ.1000 అమలులోకి వచ్చింది. ఈ పెంపుతో భక్తులకు అదనంగా శెల్ల, కనుము, స్వామివారి ప్రతిమలు అందజేస్తారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, దేవాదాయ కమిషనర్‌, ఆలయ ఈవో వెంకట్రావు దంపతులు వేర్వేరుగా టికెట్‌ కొనుగోలు చేసి వ్రతాలు ఆచరించారు.


అలాగే, నూతనంగా నిర్మించిన ప్రసాదాల టికెట్‌ కౌంటర్‌ను ప్రారంభించారు. మరోవైపు, యాదగిరిక్షేత్రానికి వచ్చే భక్తుల క్యూలైన్లను వేగంగా, క్రమపద్ధతిలో నడపడంపై ట్రైనింగ్‌ ఆన్‌ క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విశ్లేషకుడు ప్రసన్నకుమార్‌ సిబ్బందికి అవగాహన కల్పించారు.

Updated Date - Jul 26 , 2025 | 05:51 AM