TGSPDCL: హెచ్‌టీ కొత్త కనెక్షన్ల జారీకి సింగిల్ విండో!
ABN , Publish Date - May 06 , 2025 | 04:56 AM
హెచ్‌టీ కొత్త కనెక్షన్ల జారీకి ఆగస్టు నాటికి సింగిల్ విండో విధానం అందుబాటులోకి తీసుకువస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు.

ఆగస్టు నాటికి అందుబాటులోకి..
మెరుగైన సేవ లే లక్ష్యంగా చర్యలు
‘ఆంధ్రజ్యోతి’తో టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి
హైదరాబాద్ సిటీ, మే 5 (ఆంధ్రజ్యోతి) : హెచ్‌టీ కొత్త కనెక్షన్ల జారీకి ఆగస్టు నాటికి సింగిల్ విండో విధానం అందుబాటులోకి తీసుకువస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. హెచ్‌టీ వినియోగదారులు కార్యాలయాలకు రాకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కనెక్షన్లు ఇచ్చేలా ఈ విధానం రూపొందించినట్లు తెలిపారు. ఆగస్టు మొదటి వారానికల్లా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ టీజీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో సీఎండీ ముషారఫ్ మాట్లాడారు. దక్షిణ డిస్కంలో సాంకేతికత పరంగా అనేక మార్పులు తీసుకువస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
రంగారెడ్డి, మేడ్చల్, పఠాన్‌చెరువుతో పాటు శివారు ప్రాంతాల్లో వస్తున్న భారీ పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. డిస్కంలో మొత్తం 13,099 హెచ్‌టీ కనెక్షన్లు ఉండగా ఇప్పటి వరకు వెయ్యి కనెక్షన్లకు ఏఎంఆర్ విధానంతో ప్రతి నెలా 30వ తేదీన అర్ధరాత్రి బిల్లు ఆటోమేటిక్‌గా వినియోగదారులకు ఈ మెయిల్ ద్వారా వెళుతుందన్నారు. రెండు నెలల తర్వాత హెచ్‌టీ బిల్లుల జారీ ప్రక్రియ అంతా ఆటోమెటిక్ ఆన్‌లైన్ రీడింగ్(ఏఎంఆర్)తో జరుగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించామని, ఎక్కడ ఫీడర్ ట్రి ప్పింగ్ జరిగినా నిమిషాల్లో అక్కడికి సిబ్బంది వెళ్లి సమస్యలు పరిష్కరించేలా ఏర్పాటు చేసిన 1912 మొబైల్ వాహనాలు మంచి ఫలితాలిస్తున్నాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News