Share News

TGPSC: గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీలు

ABN , Publish Date - Apr 28 , 2025 | 06:26 PM

గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటీషన్ వేసింది. రిక్రూట్‌మెంట్ తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని..

TGPSC: గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీలు
TGPSC Group1 Recruitments

TGPSC Group1 Recruitments: గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటీషన్ వేసింది. తెలంగాణలో గ్రూప్‌-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని తన అప్పీల్ పిటిషన్లో కోరింది. దీనిపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. గ్రూప్‌ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియకు అంతరాయం నెలకున్న సంగతి తెలిసిందే.

ఫలితంగా గ్రూప్ 1 అభ్యర్థుల నియామకంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు గతంలో ఆదేశించింది. మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు.

దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువపత్రాల పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీజే ధర్మాసనంలో టీజీపీఎస్సీ ఇప్పుడు అప్పీల్ పిటిషన్‌ దాఖలు చేసింది. సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేసినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది సింగిల్ బెంచ్‌కు విన్నవించడంతో ఇదే అంశంపై ఇవాళ జరగాల్సిన విచారణను జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు బుధవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

Attention train passengers: మే 1 నుంచి రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..

Pahalgam Attack: దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్ అధిష్టానం

AP Ministers: మార్చి నాటికి బందరు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి

Pahalgam Terror Attack: భరత్ భూషణ్ భార్య సుజాతను విచారించిన ఎన్ఐఏ

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..

Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్

Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..

For National News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 06:26 PM