Share News

Weather Report: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ABN , Publish Date - Jun 13 , 2025 | 09:02 AM

Telangana Weather Report: ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Report: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Telangana Weather Report

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షాలు పడ్డాయి. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 8.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. రంగారెడ్డి జిల్లాలో 8.38 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. హైదరాబాద్ నగరంలోనూ వర్షం దంచికొట్టింది. హైదరాబాద్‌లో అత్యధికంగా ముషీరాబాద్ 4.18 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్ 3.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఈరోజు, రేపు(శుక్ర, శని) కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర, కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.


పిడుగులు పడే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించింది. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

విమాన ప్రమాదంపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Updated Date - Jun 13 , 2025 | 03:02 PM