Jupally: అందరినీ ఆకర్షించేలా టూరిజం పాలసీ: జూపల్లి
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:56 AM
రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆదాయం పెంచుకోవడంతో పాటు పర్యాటక రంగంలో యువతకు భారీగా ఉపాధి కల్పించే నిర్ణయాలు తీసుకోనున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆదాయం పెంచుకోవడంతో పాటు పర్యాటక రంగంలో యువతకు భారీగా ఉపాధి కల్పించే నిర్ణయాలు తీసుకోనున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా టూరిజం పాలసీని తీసుకురానున్నామని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా పోచారం అభయారణ్యంలో ఏకో టూరిజం అభివృద్ధి చేయనున్నామని ఆయన తెలిపారు.
పసుపు బోర్డు రాకముందు క్వింటాలు పసుపు రూ.16 వేలకు అమ్ముడుపోగా.. బోర్డు పెట్టాక అది రూ.8 వేలకు పడిపొయిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సభలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని కోరారు. మెదక్ జిల్లా గుమ్మడిదల అటవీ ప్రాంతంలోని ప్యారానగర్ లో 100 ఎకరాల్లో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డును కడుతోందని, దీన్ని నిలిపివేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. 2027లో గోదావరి పుష్కరాలు జరుగనున్నాయని, దీనికోసం పనులు ముమ్మరం చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.