Share News

Telangana Rising Global Summit: తెలంగాణను సినిమా హబ్‌గా మార్చే మరో కీలక అడుగు

ABN , Publish Date - Dec 01 , 2025 | 08:08 PM

తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా వివిధ రంగాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు.

Telangana Rising Global Summit: తెలంగాణను సినిమా హబ్‌గా మార్చే మరో కీలక అడుగు
, Telangana global summit 2025

తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా వివిధ రంగాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రత్యేక వేదికను ఫ్యూచర్ సిటీలో రూపొందిస్తున్నారు. సమ్మిట్‌లో భాగంగా మూడు వేల డ్రోన్లతో షోను ఏర్పాటు చేస్తున్నారు (Bharat Future City summit).


హైదరాబాద్‌లో అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్ సిటీ రూపొందించనున్నారు. ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అజయ్ దేవ్‌గన్ ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ గ్రూప్‌ ముందుకు వచ్చింది. వెంటారా కన్జర్వేటరీ నిర్మించేందుకు రిలయన్స్ ఆసక్తిగా ఉంది. వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీ ప్రాజెక్ట్ పర్యాటక రంగానికి భారీ ప్రోత్సాహకం అందించనున్నాయి (Hyderabad investment summit).


గ్లోబల్ సమ్మిట్‌కు భారీ స్పందన లభిస్తోంది (Telangana Rising). సమ్మిట్‌లో కీలక ఒప్పందాల చేసుకునేందుకు పలువురు పెట్టుబడి దారులు ముందుకు వస్తున్నారు. ఫుడ్‌లింక్ భారీ ఇన్వెస్ట్‌మెంట్ చేయబోతోంది. రూ. 3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఫ్యూచర్ సిటీలో మూడు లగ్జరీ హోటల్స్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

కేటీఆర్ అండ్ కో రెచ్చగొడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మేడారం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 01 , 2025 | 08:21 PM