Share News

TG Minister: లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్..

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:41 PM

నకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రులకు తెలంగాణ మంత్రులకు మాటల యుద్ధం మొదలయ్యింది. బనకచర్ల ప్రాజెక్టును సమర్ధించుకుంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.

TG Minister: లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్..

హైదరాబాద్ : బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రులకు తెలంగాణ మంత్రులకు మాటల యుద్ధం మొదలయ్యింది. బనకచర్ల ప్రాజెక్టును సమర్ధించుకుంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ మంత్రులు లోకేష్ మాటలను సమర్థిస్తుంటే... తెలంగాణ మంత్రులు ఆయన మాటాలకు కౌంటర్ ఇస్తున్నారు.


ఏపీ మంత్రి లోకేష్ మాటలపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చిన తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి ఏపీ ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. బనకచర్లప్రాజెక్టు(Banakacharla Project)పై ఏపీ మంత్రుల ప్రకటనలు తాము పట్టించుకోమని తేల్చి చెప్పారు.

అనంతరం మంత్రి లోకేష్ మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabakar) కౌంటర్ ఇచ్చారు. లోకేష్ నికర, మిగులు, వరద జలాలు గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బనకచర్లపై ఏపీ పట్టుబడితే పోలవరంపై కౌంటర్ ఇస్తామన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో చుక్క కూడా వదులుకోం అని స్పష్టం చేశారు. అసమానతలు రెచ్చగొడుతున్నారన్న లోకేష్ వ్యాఖ్యలు సరికావని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

Updated Date - Aug 03 , 2025 | 01:41 PM