IT Minister Sridhar Babu: సీఎస్‌సీ ఒప్పందం రద్దు చేయండి
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:57 AM
మీసేవ కేంద్రాలు అందిస్తున్న సేవలన్నీ ప్రైవేటు సంస్థ సీఎ్‌ససీకి అప్పగించాలని ఈఎ్‌సడీ మీసేవ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.

మీసేవ కమిషనర్‌కు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు
మీసేవ కేంద్రాలు అందిస్తున్న సేవలన్నీ ప్రైవేటు సంస్థ సీఎ్‌ససీకి అప్పగించాలని ఈఎ్‌సడీ మీసేవ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. దీనికి సంబంధించి గత వారం ఈఎ్‌సడీ కమిషనర్ సీఎ్‌ససీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ మీసేవ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులు శుక్రవారం మంత్రిని కలిశారు.
ప్రైవేటు సంస్థకు అనుమతిస్తే మీసేవ కేంద్రాలన్నీ మూతపడతాయని అధ్యక్ష, కార్యదర్శులు బైర శంకర్, ముహమ్మద్ మోయిద్ మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి ఈఎ్‌సడీ మీసేవ కమిషనర్ రవికిరణ్‌కు ఫోన్ చేశారు. ప్రైవేటు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్న మీ సేవ కేంద్రాల్లో మరిన్ని సేవలు పెంచుతామని, అవసరమున్న చోట కొత్త కేంద్రాలకూ అనుమతిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.