Telangana liquor Shop Tenders: తెలంగాణలో 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఏపీకి చెందిన ఓ మహిళ
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:33 PM
తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు నేటితో గడువు ముగిసింది. ఈ ఒక్కరోజు 30 వేలతో కలిపి మొత్తంగా 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఏపీకి చెందిన ఓ మహిళ 150 వైన్ షాపులకు..
హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు నేటితో గడువు ముగిసింది. ఇవాళ(శనివారం) చివరి రోజు భారీగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ రోజు ఒక్కరోజే 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అంచనా. ఆశ్చర్యకరంగా ఏపీకి చెందిన ఓ మహిళ 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసింది. ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని షాపులకు ఈమె ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు సమాచారం.
ఏపీ మహిళలే కాదు, దరఖాస్తు చేసుకున్న వారిలో యూపీ, కర్ణాటక, ఒడిశాకు చెందిన మహిళలు కూడా ఉండటం విశేషం. తెలంగాణలో 2620 వైన్ షాపులకు గత నెల 27న టెండర్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 5గంటలతో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈనెల 23న డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ లు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి..
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ
Read Latest Telangana News And Telugu News