Share News

Telangana High Court: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ చేసిన దుండగులు..

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:34 AM

తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లు ఓపెన్ అయినట్లు సమాచారం.

Telangana High Court: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ చేసిన దుండగులు..
Telangana High Court

సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఆశ్రయించారు. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది అంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ నెల 11వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 11వ తేదీనే హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెబ్‌సైట్ హ్యాక్ చేసిన వారిని కనుక్కునే పనిలో పడ్డారు. వెబ్‌సైట్‌లోని సమస్యను క్లియర్ చేశారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతీ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ‘ఈ కేసులు’ ఎప్పుడు ఉంటాయన్న దానితో పాటు జడ్జీల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. వెబ్‌సైట్ హ్యాక్ అయిన విషయం గురించి ఐటీ టీమ్ రిజిస్ట్రార్‌కు సమాచారం ఇచ్చింది. రిజిస్ట్రార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.


ఇవి కూడా చదవండి

అద్భుతమైన ట్రిక్.. పిల్లాడు మొబైల్ ఎక్కువగా చూస్తున్నాడని తల్లి ఏం చేసిందంటే..

ఏపీ పరిశ్రమల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 15 , 2025 | 12:04 PM