Gig workers: గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:19 AM
రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈనెల 12న మంత్రిమండలి మీటింగ్‌కి ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 7: ఎంతో మంది గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్) సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వారికి అండగా ఉంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లు, కార్మిక సంఘాలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈనెల 12న మంత్రిమండలిలో ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. కార్మికుల కోసం బిల్లులో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. చట్టంలో గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు ఏ విధంగా ఇవ్వాలనేదానిపై సమీక్షిస్తున్నామని చెప్పారు. ఈ విషయమై అగ్రిగేటర్లతో మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తామన్నారు. చట్టం అమల్లోకి వచ్చాక.. మార్పులు చేయాల్సి ఉంటే ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. గిగ్ వర్కర్లు ఒక్కొక్కరు గంట జొమాటోకు పనిచేస్తే, మరో గంట స్విగ్గీకి చేస్తారని.. వారికి కనీస వేతన చట్టం ఎలా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Investigation of defecting MLAs: ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్