Sri Chaitanya School: నాసా పోటీల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:12 AM
నాసా ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలో ఎన్‌ఎ్‌సఎ్‌స - ఐఎ్‌సడీసీ కాన్ఫరెన్స్ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య స్కూల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నాసా ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలో ఎన్‌ఎ్‌సఎ్‌స - ఐఎ్‌సడీసీ కాన్ఫరెన్స్ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య స్కూల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పోటీలో 30 దేఽశాలకు చెందిన 475 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 67 మంది భారతీయులు ఉండగా, 45 మంది తమ విద్యార్థులు కాగా, 22 మంది తెలుగు వారని శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమ తెలిపారు.
ఈ పోటీలో ప్రపంచ టైటిల్‌తోపాటు పలు బహుమతులు గెలుచుకున్నారన్నారు. గత 14 ఏళ్లుగా తమ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడంతోపాటు విజేతగా నిలుస్తున్నారన్నారు. నాసా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అభినందించారు.