Share News

Gaddam Prasad Kumar: న్యాయ సలహా తీసుకుంటాం

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:17 AM

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై తాను ఇప్పుడే ఏమీ

Gaddam Prasad Kumar: న్యాయ సలహా తీసుకుంటాం

  • 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులిచ్చాం

  • సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కోరారు: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై తాను ఇప్పుడే ఏమీ స్పందించలేనని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రతిని స్వీకరించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని చెప్పారు. వారి సలహా మేరకే తదుపరి చర్యలు ఉంటాయన్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి, కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చేసిన వ్యాఖ్యల ప్రకారం కోర్టులు రాష్ట్రపతి, స్పీకర్లను ప్రశ్నించలేవని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలోకి మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కోరారని తెలిపారు. ఈ అంశంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుని, చట్ట ప్రకారమే తుది నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 04:17 AM