SLBC Tunnel Renovation: కొత్త టెక్నాలజీతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల పునరుద్ధరణ
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:48 AM
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల

ఏడాది వ్యవధిలో 4.8 కిలోమీటర్లు తవ్వాలి
జలాశయాల నుంచి ఆయకట్టుకు నీళ్లివ్వాలి
రెండు నెలల్లోపు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలి: ఉత్తమ్
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నూతన సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్‌ఐ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎ్‌సఐ)ల సహకారంతో 10 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులను సత్వరంగా పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించుకున్న ఆర్మీ మాజీ అధికారులు జనరల్ హర్పాల్‌సింగ్, కల్నల్ పరిక్షిత్ మెహ్రాల సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. శనివారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ పనులకు అసవరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఏడాది వ్యవధిలో 4.8 కిలోమీటర్ల మేర తవ్వం పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తల సహకారంతో ఏరియల్ లైడార్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జలాశయాల్లో నీటి నిల్వల ఆధారంగా ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు సాగు నీరందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న డీఈల నుంచి ఈఎన్సీల వరకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్దిష్ట వ్యవధిలోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తికావాలని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News