Share News

Singareni: నైనీ ప్రజేక్ట్‌తో సింగరెణి విశ్వవ్యాప్తం..

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:22 AM

తెలంగాణలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సంస్థ ఒడిసాలోని నైనీ ప్రాజెక్ట్‌ ద్వారా విశ్వవ్యాప్త విస్తరణ వైపు పరుగుల తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Singareni: నైనీ ప్రజేక్ట్‌తో సింగరెణి విశ్వవ్యాప్తం..

  • ఒడిసాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తిని వర్చువల్‌గా ప్రారంభించిన భట్టి

హైదరాబాద్‌/కొత్తగూడెం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సంస్థ ఒడిసాలోని నైనీ ప్రాజెక్ట్‌ ద్వారా విశ్వవ్యాప్త విస్తరణ వైపు పరుగుల తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఒడిసా రాష్ట్రం అంగూల్‌ జిల్లాలోని నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని ఆయన వర్చువల్‌గా ప్రాంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని ప్రారంభించడం సువర్ణ అధ్యాయమని తెలిపారు. నైనీ బ్లాక్‌ సింగరేణికి కేటాయించి తొమ్మిదేళ్లయినా అనుమతుల్లో జాప్యంతో ప్రారంభం ఆలస్యమైందన్నారు ఏడాది క్రితం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, తాను కేంద్ర బొగ్గు శాఖమంత్రిని పలుమార్లు కలిసి పూర్తి అనుమతులు తీసుకుని ఏడాదిలోనే నైనీ బ్లాక్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. సహకరించిన కేంద్ర బొగ్గు శాఖమంత్రి కిషన్‌రెడ్డికి, కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, ఒడిసా సీఎం మోహన్‌చరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


భవిష్యత్‌ తరాలకు బంగారు బాట: సీఎం

సింగరేణి సంస్థ తన 136 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు చేపట్డడం అభినందనీయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 13 దశాబ్దాలకు పైగా బొగ్గు ఉత్పత్తి చేస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి వె లుగులు పంచుతున్న సింగరేణి రాష్ట్రం బయట నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలు చేపట్టి, భవిష్యత్‌ తరాలకు బంగారు బాటలు వేయనున్నట్లు తెలిపారు. తొలిసారి రాష్ట్రం అవతల బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం సింగరేణి సంస్థ చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 17 , 2025 | 04:22 AM