Share News

Singareni: సింగరేణి ఉపకార వేతనం

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:18 AM

సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు ఇవ్వనున్న వార్షిక ఉపకార వేతనాన్ని రూ.10,000 నుండి రూ.16,000 వరకు పెంచడం జరిగింది. ర్యాంకులు 2000 వరకు ఉండే అర్హతను 8000 వరకు పెంచారు

Singareni: సింగరేణి ఉపకార వేతనం

  • రూ.16 వేలకు పెంపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌, నీట్‌, జేఈఈ మెయిన్స్‌ తదితర ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు ఇప్పటి వరకు ఇస్తున్న వార్షిక ఉపకార వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ. 16 వేలకు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పటి వరకు దీనికి అర్హతగా 2000లోపు ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉండగా... దాన్ని 8000 వరకు పెంచారు. ఈ ఉత్తర్వులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు కూడా వర్తిస్తాయని, అన్ని ఏరియాల నుంచి జూన్‌ 15లోపు దరఖాస్తులు పంపించాలని అధికారులు కోరారు.

Updated Date - Apr 23 , 2025 | 05:18 AM