Share News

Singareni: రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం దరఖాస్తు గడువు 12 వరకు పొడిగింపు

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:50 AM

కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి సంస్థ ప్రారంభించిన రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయ హస్తం పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12 వరకు..

Singareni: రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం దరఖాస్తు గడువు 12 వరకు పొడిగింపు

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి సంస్థ ప్రారంభించిన రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయ హస్తం పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12 వరకు పొడిగించినట్లు సంస్థ సీఎండీ ఎన్‌.బలరామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులై... మెయిన్స్‌కు సన్నద్దమవుతోన్న అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిచనున్నట్లు తెలిపారు.


దరఖాస్తుల స్వీకరణకు గతంలో ఇచ్చిన గడువు ఈనెల 7వ తేదీతో ముగిసింది. అయితే అభ్యర్థుల నుంచి వస్తోన్న విజ్ఞప్తుల మేరకు గడువును పెంచడానికి నిర్ణయించినట్లు సంస్థ సీఎండీ తెలిపారు.

Updated Date - Jul 10 , 2025 | 05:50 AM