Singareni CMD: ‘సోలార్’ పనుల్లో జాప్యం చేస్తే కాంట్రాక్ట్ రద్దు
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:11 AM
సోలార్ ప్లాంట్ల నిర్మాణాలను ఒప్పందంలో పేర్కొన్న కాల పరిమితికి లోబడి పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు, బ్లాక్ లిస్టులో చేర్చుతామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఏజెన్సీలను హెచ్చరించారు.

సింగరేణి సీఎండీ బలరామ్ హెచ్చరిక
సోలార్ ప్లాంట్ల నిర్మాణాలను ఒప్పందంలో పేర్కొన్న కాల పరిమితికి లోబడి పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు, బ్లాక్ లిస్టులో చేర్చుతామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఏజెన్సీలను హెచ్చరించారు. గురువారం ఇక్కడి సింగరేణి భవన్‌లో ఆయన సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అధికారులు, సంబధిత కాంట్రాక్టర్లతో సమీక్షించారు.
మొదటి దశలో ఇంకా పూర్తి చేయాల్సి ఉన్న 54.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం, రెండో దశలో పూర్తి చేయాల్సి ఉన్న 67.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియపై ఆయన నిశితంగా సమీక్షించారు. బిల్లుల చెల్లింపులో సింగరేణి ఎటువంటి జాప్యం చేయనప్పటికీ నిర్మాణ సంస్థలు తమ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం విచాకరమన్నారు. అక్టోబరు నెలాఖరునాటికి పనులను పూర్తి చేయాలని, ఇకపై ఎటువంటి పొడిగింపులు ఉండబోవని స్పష్టం చేశారు.