Kaleshwaram project: కాళేశ్వరం బాధ్యుల నుంచి అందిన సంజాయిషీలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 06:05 AM
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారుల్లో ఒకరిద్దరు తప్ప.. అందరూ తమ సంజాయిషీలను ప్రభుత్వానికి సమర్పించారు.

అధ్యయనం చేశాక చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారుల్లో ఒకరిద్దరు తప్ప.. అందరూ తమ సంజాయిషీలను ప్రభుత్వానికి సమర్పించారు. వారు చెప్పి న కారణాలపై అధ్యయనం చేశాక, తదుపరి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టనుంది.
కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి కారకులైన 17 మందిపై నేరపూరిత కేసు పెట్టాలని, 33 మందిపై శాఖపరమైన చర్యలు(ఆర్టికల్ ఆఫ్ చార్జెస్), పదవీ విరమణ చేసిన 7 మందికి పెన్షన్‌లో కోత విధించాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం విదితమే.