Uttam Kumar Reddy: కాళేశ్వరం రుణాలను రీషెడ్యూల్ చేయండి
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:03 AM
కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్‌కు ఇచ్చిన రుణాలను రీషెడ్యూల్ చేయాలంటూ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్

వడ్డీ రేటు తగ్గించి.. కాలపరిమితిని పెంచండి : ఉత్తమ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్‌కు ఇచ్చిన రుణాలను రీషెడ్యూల్ చేయాలంటూ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) సీఎండీ జితేంద్ర శ్రీవాస్తవను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జితేంద్ర శ్రీవాస్తవతో ఆయన భేటీ అయ్యారు. రూ.16 వేల కోట్ల రుణాలను కాళేశ్వరంలోని ఎలకో్ట్ర మెకానికల్ కాంపోనెంట్ కోసం ఇచ్చారని, రుణాలను తక్కువ వ్యవధిలో అధిక వడ్డీతో కట్టాల్సి ఉండటంతో నిధులన్నీ రుణ చెల్లింపులకే పోతున్నాయని మంత్రి నివేదించారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా గాడిన పడుతున్న తెలంగాణకు ఇది ఇబ్బందిగా మారుతోందన్నారు. వడ్డీరేట్లను తగ్గించి రుణ చెల్లింపు కాలపరిమితిని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జితేంద్ర శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారు. ఇక మున్ముందు తీసుకోబోయే రుణాలను తక్కువ వడ్డీకే ఇస్తామని ఆర్‌ఈసీ హామీనిచ్చినట్లు మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News