Share News

అబద్ధాలకు కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:34 AM

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కేసీఆర్‌ను అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా విమర్శించారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి దారి తీసే అవకాశాలు ఉన్నా, తాము కరెక్ట్‌గా పని చేయలేదని వ్యాఖ్యానించారు

అబద్ధాలకు కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

  • దురదృష్టం కొద్దీ మా వాళ్లు కరెక్ట్‌గా లేరు: రాజాసింగ్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : ‘ఝూటాకు కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌... ఆయన అబద్ధపు మాటలే మాట్లాడుతున్నాడు... మావాళ్లు కరెక్ట్‌గా ఉంటే గత ఎన్నికల్లోనే బీజేపీ అధికారంలోకి వచ్చేది..’ అని బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమి నిధులు ఇవ్వలేదని కేసీఆర్‌ అంటున్నారని, ఆయన పేర్కొంటున్న పదేళ్ల పాలనలో ఎన్ని నిధులు వచ్చాయో స్పష్టం చేయాలని లేకపోతే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘మా దురదృష్టం కొద్దీ మా వాళ్లు కరెక్ట్‌గా లేరు... లేకుంటే గత ఎన్నికల్లోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది’’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఏం ఫరక్‌ పడలేదని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని రాజాసింగ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Apr 29 , 2025 | 03:34 AM