Share News

Cheque Scam: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల గోల్‌మాల్‌.. హరీశ్‌రావు కార్యాలయ మాజీ సిబ్బంది

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:38 AM

బీఆర్‌ఎస్‌ హయాంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో చోటుచేసుకున్న సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల గోల్‌మాల్‌ విషయంలో అప్పటి సిబ్బందిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.

Cheque Scam: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల గోల్‌మాల్‌.. హరీశ్‌రావు కార్యాలయ మాజీ సిబ్బంది

  • మరోసారి అరెస్టు రిమాండ్‌కు ఇద్దరి తరలింపు

  • పరారీలో మరో ముగ్గురు

జూబ్లీహిల్స్‌/ఆదిలాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ హయాంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో చోటుచేసుకున్న సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల గోల్‌మాల్‌ విషయంలో అప్పటి సిబ్బందిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇందులో మాజీ ఉద్యోగి జోగుల నరేశ్‌ కుమార్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేటకు చెందిన రాళ్ల బండి వెంకటేశ్‌ 2022లో అనారోగ్యం బారిన పడగా.. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు లెటర్‌పై సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. 2023 మార్చిలో వెంకటేశ్‌ తన స్నేహితుడి సాయంతో జూబ్లీహిల్స్‌లోని హరీశ్‌రావు కార్యాలయానికి వచ్చి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ గురించి వాకబు చేశాడు.


అయితే వెంకటేశ్‌కు మంజూరైన రూ.45 వేలను అప్పటి ఉద్యోగి జోగుల నరేశ్‌ ఫోర్జరీ సంతకాలతో చెక్కును సొంత ఖాతాలో వేసుకున్నట్టు తెలిసింది. వెంకటేశ్‌ అప్పుడు అనారోగ్యంతోనే ఉండటంతో చేసేందేం లేక వెనుదిరిగాడు. స్నేహితుల సలహా మేరకు ఈనెల 15న జూబ్లీహిల్స్‌ పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో మరో బాధితుడు కూడా అంతకుముందే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలోనే మెట్టుగూడకు చెందిన జోగుల నరేశ్‌, వనస్థలిపురానికి చెందిన బాలగోని వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. 2023 ఎన్నికల సమయంలో హరీశ్‌రావు కార్యాలయం నుంచి విడుదలైన 19 చెక్కులను ఎవరూ క్లెయిమ్‌ చేసుకోకపోవడంతో వంశీ, ఓంకార్‌, మరో మహిళతో సాయంతో ఫోర్జరీ సంతకాలు చేసి రూ.8.71 లక్షలు కాజేసినట్లు వారు అంగీకరించారు.

భూకబ్జా కేసులో ఆదిలాబాద్‌ జిల్లా జాగృతి అధ్యక్షుడి అరెస్టు

భూకబ్జా కేసులో ఆదిలాబాద్‌ జిల్లా జాగృతి అధ్యక్షుడు రంగినేని శ్రీనివా్‌సను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్‌ మునిసిపాలిటీ రోడ్డును కబ్జా చేసి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 04:38 AM