Inter Results: ఇంటర్ సప్లమెంటరీలో 51% ఉత్తీర్ణత
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:45 AM
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో 51ు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత నెల 22-29 తేదీల మధ్య జరిగిన ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు మొత్తం 4,13,880 మంది విద్యార్థులు హాజరయ్యారు.

గతేడాదితో పోలిస్తే 7% అధికం .. బాలుర కంటే బాలికలదే పైచేయి
ఫలితాలు ప్రకటించిన విద్యాశాఖ కార్యదర్శి
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 23వరకు గడువు
ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
హైదరాబాద్/ నస్పూర్/ జహీరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో 51ు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత నెల 22-29 తేదీల మధ్య జరిగిన ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు మొత్తం 4,13,880 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం ఇంటర్‌లో 2,49,358 మంది హాజరు కాగా, 1,68,079 (67.4ు) మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం ఇంటర్‌లో 1,35,107 మంది హాజరవ్వగా 68,665 (50.82ు) మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, ఇంటర్ సెకండియర్ సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం ఇంటర్‌లో ఏడు శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదు కాగా, 2023-24 విద్యా సంవత్సరంలో 43.77ు మంది ఉత్తీర్ణులవ్వగా.. బాలురిపై బాలికలు ఆధిక్యత ప్రదర్శించారు. ప్రథమ సంవత్సరంలో 61.75శాతం మంది బాలురు, 73.88 శాతం మంది బాలికలు.. ద్వితీయ సంవత్సరంలో 48.54 శాతం మంది అబ్బాయిలు, 54.47 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరీక్షల నియంత్రణాధికారి జయప్రద బాయి సోమవారం ఇంటర్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థులు తమ జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 17 నుంచి 23 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని కృష్ణ ఆదిత్య తెలిపారు. ఒక్కో పేపర్ రీ కౌంటింగ్ కోసం రూ.100, దిద్దిన జవాబు పత్రాల రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సప్లమెంటరీ పరీక్షా ఫలితాల్లో భూపాలపల్లి, ములుగు జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. భూపాలపల్లిలో ప్రథమ సంవత్సరం 83.45ు, ద్వితీయ సంవత్సరం 88.64ు, ములుగులో ప్రథమ సంవత్సరం 82.2ు, ద్వితీయ సంవత్సరం 84.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. చివరి స్థానంలో నిలిచిన వికారాబాద్ జిల్లాలో ప్రథమ సంవత్సరం ఇంటర్‌లో 55.62ు, ద్వితీయ సంవత్సరంలో కేవలం 33.54ు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
సెకండియర్ ఫెయిలయ్యామని మనస్తాపంతో..
సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయామని మనస్థాపంతో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణం పాలయ్యారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం జయశంకర్ కాలనీ వాసి కొటోజి అక్షయ (16).. స్థానిక కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో గణితం-2 పరీక్ష ఫెయిలైంది. దీంతో సప్లమెంటరీ రాసినా పాస్ కాలేదని మనస్తాపంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షా ఫలితాలు తెలుసుకోవడానికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తల్లి ప్రవీణ ఇంటికొచ్చి చూసే సరికి అక్షయ ఉరేసుకుందని, స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారని నస్పూర్ ఎస్‌ఐ ఉపేందర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మహాబత్ పూర్ గ్రామ వాసి రాయిపల్లి వెంకట రమణ (19).. సెకండియర్ సంస్కృతం, ఫిజిక్స్ సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై, జహీరాబాద్‌లోని తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పట్టణ ఎస్‌ఐ వినయ్ కుమార్ తెలిపారు.
గ్రూప్ ఇంటర్-1 ఉత్తీర్ణత ఇంటర్-2 ఉత్తీర్ణత
మొత్తం (శాతం) మొత్తం (శాతం)
ఎంపిసి 134326 105123 59684 35248
(78.26) (59.06)
ఎంఈసీ 7768 4458 5978 2966
(57.39) (49.62)
బైపిసి 53266 37923 23175 12527
(71.2) (54.05)
సీఈసీ 49156 18543 42696 16232
(37.72) (38.02)
హెచ్‌ఈసీ 4762 1984 3479 1662
(41.66) (47.77)
ఇతర 80 48 95 30
(60) (31.58)
మొత్తం 249358 168079 135107 68665
(67.4) (50.82)
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News