OU Amazon Offer: ఓయూ విద్యార్థినికి రూ. 45లక్షల ప్యాకేజీ
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:24 AM
ఓయూ విద్యార్థిని సునందన అమెజాన్ కంపెనీలో రూ. 45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందింది. ఇతర విద్యార్థులు కూడా ప్రముఖ కంపెనీల్లో అధిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదించారు

అమెజాన్ కంపెనీలో ఉద్యోగం
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో సత్తాచాటారు. బీఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎ్‌సఈ), ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్‌లెర్నింగ్ (ఏఐఎంఎల్) బ్రాంచ్‌ల విద్యార్థులు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో గొప్ప ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందారు. సీఎ్‌సఈ విద్యార్థిని సునందన అమెజాన్ కంపెనీలో రూ.45లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఐరాజ్ ఫాతిమా జెస్ట్‌పే కంపెనీలో రూ.27లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందగా, డీఈ షావ్ కంపెనీలో మోహ్ద్ ఆరిఫ్ రూ.24.85లక్షలు, ఎస్.ఏ. నదీమ్ రూ.24.85లక్షల ప్యాకేజీలతో ఉద్యోగం పొందారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్ విద్యార్థులను సన్మానించారు. అనంతరం సునందన మాట్లాడుతూ, బీటెక్ మూడో సంవత్సరం తరువాత తాను అమెజాన్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా ఈ అవకాశాన్ని అందుకున్నానని వివరించింది.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News