Nagarjuna Sagar Dam Recommendations: నాగార్జునసాగర్, ఎస్సారెస్పీలనూ పరిశీలించండి
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:43 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సంబంధించి ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటీ పలు కీలక సూచనలు చేసింది. ప్రాజెక్టు గేట్ల, స్పిల్‌వే, సీపేజీలకు సంబంధించి మరమ్మత్తులు మరియు సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించింది.

ఎన్‌డీఎస్ఏ.. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), ఏపీకి సూచించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది.
సాగర్‌పై ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసులు ఇవీ.
గేట్లను ఎత్తడానికి వీలుగా ఉన్న కౌంటర్ వెయిట్‌ల వద్ద పిల్లర్లలో కొన్ని పగుళ్లు ఉన్నాయి. అన్ని పిల్లర్లను సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలి.
గేట్లు తెరిచిన తర్వాత స్పిల్‌వే(నీరు జారే ప్రాంతం)లో అసాధారణ రంధ్రాలు గుర్తించాం. ఆ రంధ్రాలను కాంక్రీట్‌తో నింపాలి.
స్పిల్‌వే దిగువ భాగంలో రాళ్లు బయటికి తేలి కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులో నీటినిల్వలు లేని సమయంలో ఆ రాళ్లను సరిచేసి, మరమ్మతులు చేయాలి. వానాకాలం లోపు ఈ పనులన్నీ పూర్తిచేయాలి.
గ్యాలరీ(కట్ట కడుపు భాగం)లో సీపేజీలను ప్రత్యేకంగా అంచనా వేయాలి. పునాది నుంచి వస్తున్న సీపేజీల్లో ఏయే అంశాలున్నాయనేది తేల్చాలి.
గ్యాలరీలోకి వెళ్లడానికి లిఫ్టులతో పాటు మెట్లు ఉన్నాయి. లిఫ్టును మరమ్మతులు చేసినా.. మెట్లు సరిగ్గా లేవు. గ్యాలరీని నిరంతరం పరిశీలించడానికి వీలుగా తగినంత వెలుతురును ఉండేలా చూసుకోవాలి.
కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో భారీగా సీపేజీని గుర్తించాం. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలి.
డ్యామ్‌సేఫ్టీ చట్టం-2021 ప్రకారం డ్యామ్‌ను సమగ్ర పరిశీలన చేయించాలి.
కట్టతో పాటు కాలువల్లో గడ్డితో పాటు ఇతరత్రా పదార్థాలను తొలగించాలి.నిపుణుల కమిటీ సిఫారసులు ఇవీ.
గేట్లను ఎత్తడానికి వీలుగా ఉన్న కౌంటర్ వెయిట్‌ల వద్ద పిల్లర్లలో కొన్ని పగుళ్లు ఉన్నాయి. అన్ని పిల్లర్లను సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలి.
గేట్లు తెరిచిన తర్వాత స్పిల్‌వే(నీరు జారే ప్రాంతం)లో అసాధారణ రంధ్రాలు గుర్తించాం. ఆ రంధ్రాలను కాంక్రీట్‌తో నింపాలి.
స్పిల్‌వే దిగువ భాగంలో రాళ్లు బయటికి తేలి కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులో నీటినిల్వలు లేని సమయంలో ఆ రాళ్లను సరిచేసి, మరమ్మతులు చేయాలి. వానాకాలం లోపు ఈ పనులన్నీ పూర్తిచేయాలి.
గ్యాలరీ(కట్ట కడుపు భాగం)లో సీపేజీలను ప్రత్యేకంగా అంచనా వేయాలి. పునాది నుంచి వస్తున్న సీపేజీల్లో ఏయే అంశాలున్నాయనేది తేల్చాలి.
గ్యాలరీలోకి వెళ్లడానికి లిఫ్టులతో పాటు మెట్లు ఉన్నాయి. లిఫ్టును మరమ్మతులు చేసినా.. మెట్లు సరిగ్గా లేవు. గ్యాలరీని నిరంతరం పరిశీలించడానికి వీలుగా తగినంత వెలుతురును ఉండేలా చూసుకోవాలి.
కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో భారీగా సీపేజీని గుర్తించాం. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలి.
డ్యామ్‌సేఫ్టీ చట్టం-2021 ప్రకారం డ్యామ్‌ను సమగ్ర పరిశీలన చేయించాలి.
కట్టతో పాటు కాలువల్లో గడ్డితో పాటు ఇతరత్రా పదార్థాలను తొలగించాలి.