Share News

Narayana Institutions: ఇంటర్‌ ఫలితాల్లో నారాయణ హవా

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:31 AM

ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థలు తెలిపింది.

Narayana Institutions: ఇంటర్‌ ఫలితాల్లో నారాయణ హవా

హైదరాబాద్‌, ఏప్రిల్‌, 22(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థలు తెలిపింది. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో తమ విద్యార్థిని పి.వర్షిణి 470కి 469 మార్కులు సాధించిందని విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకుగాను 13 మంది 995 మార్కులు సాధించారన్నారు.


జూనియర్‌ ఇంటర్‌ బైపీసీ విభాగంలో 13 మంది 440కి 438 మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్‌ ఇంటర్లో 132 మంది 468 మార్కులు సాధించారని, 487 మంది 467 మార్కులు, 856 మంది 466 మార్కులు సాధించి సత్తా చాటారని డైరెక్టర్లు పేర్కొన్నారు. తమ కళాశాలలో అందిస్తున్న ప్రత్యేక బోధన పద్ధతులతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు.

Updated Date - Apr 23 , 2025 | 04:31 AM