Share News

రానున్నది కమ్యూనిస్టుల రాజ్యమే

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:14 AM

దేశం లో రాబోయేది కమ్యూనిస్టుల రాజ్యమేనని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలో పార్టీ జిల్లా నాలుగో మహాసభలో ఆయన మాట్లాడారు.

రానున్నది కమ్యూనిస్టుల రాజ్యమే

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

వలిగొండ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): దేశం లో రాబోయేది కమ్యూనిస్టుల రాజ్యమేనని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలో పార్టీ జిల్లా నాలుగో మహాసభలో ఆయన మాట్లాడారు. పలు కారణాలతో విడిపోయిన కమ్యూనిస్టులంతా బేషజాలు వదిలి ఒకే తాటిపైకి వస్తే దోపిడీ వర్గాల రాజ్యాన్ని కూల్చవచ్చారన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం అవసరమన్నారు. గతంలో నియంతృ త్వ పోకడలు అవలంభించిన కేసీఆర్‌ను గద్దె దించడంలో ప్రధాన భూమిక సీపీఐ పోషించిందంన్నారు. కేంద్రంహోమంత్రి అమిత్‌షా మావోయిస్టులను తుద ముట్టిస్తామని ప్రకటించడం దుర్మర్గమన్నారు. మావోయిస్టులు కూడా దేశ ప్రజలే అన్న విషయాన్ని కేంద్రం మరువద్దన్నా రు. మావోయిస్టులను చంపడం సరైందికాదన్నారు. ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులు అధిక స్థానాలు గెలుపొందాలని తెలిపారు. నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటం నడిపిన మహోన్నత చరిత్ర ఈజిల్లాకే దక్కిందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి మా ట్లాడుతూ, దేశంలో యువత ప్రజాస్వామ్య వా దులు ఆలోచించి బీజేపీ కుట్రలను తిప్ప కొట్టాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీ రాములు మాట్లాడుతూ, బునాదిగానీ కాల్వ పూర్తి చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అంతకు ముందు పార్టీ జెండా ను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు. మహాసభకు బోడ సుదర్శన్‌, బండి జం గమ్మ, చేడే చంద్రయ్య అధ్యక్షత వహించారు. సమహాభలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శు లు యానాల దామోదర్‌రెడ్డి, బోలగాని సత్యనారాయణ, కార్యవర్గసభ్యులు కళ్లెం కృష్ణ, కల్లూరి రాజయ్య, ఎండీ ఇమ్రాన్‌, బచ్చనగోని గాలయ్య, ఉప్పల ముత్యాలు చెక్క వెంకటేష్‌, హరిచంద్ర, ఏశాల అశోక్‌, మండల కార్యదర్శి సలిగంజి వీరస్వామి, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు శ్రీనివాస్‌, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్షీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:14 AM