పట్టణ సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:22 AM
యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ కోరారు.
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబరు 1, (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ కోరారు. సోమవారం పట్టణంలోని 4, 5, 6 వార్డుల్లో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బాలుర హాస్టల్ నుంచి వడాయిగూడెం గ్రామం వరకు సీసీరోడ్డు నిర్మించాలని, ఇరుగ్రామల మధ్య వాగులో నీరుపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మునిసిపల్ కమిషనర్ మిర్యాల లింగస్వామికి అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, నాయకులు ఆకుల చంద్రమౌళి, నరేష్, ఆవుల సత్యనారాయణ, దొమ్మాట ప్రభాకర్, ఆలేటి కర్ణ, భువనగిరి శ్యామ్, తాళ్ల భాస్కర్‌రెడ్డి, బందారపు మల్లేష్, శివరాత్రి శ్రీశైలం, కర్రె శ్యామ్, సాయి, వంశీ, సందీప్ పాల్గొన్నారు.