ఫిబ్రవరి నుంచి థర్మల్ వెలుగులు
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:53 AM
రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేందుకు యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ సిద్ధమవుతోంది. పవర్‌ప్లాంట్ నిర్మాణం లో ఒక్కో ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేస్తున్న జెన్‌కో యంత్రాంగం విద్యుదుత్పాదన చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణను ఒక్కోటిగా నెరవేరుస్తోం ది.

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో 4,000 మెగావాట్ల విద్యుదుత్పాదన
పర్యావరణ అనుమతులు రావడం తో ముమ్మరంగా పనులు
మార్చి 2026 నాటికి మొత్తం ప్లాంట్ సిద్ధం చేసేలా కార్యాచరణ
హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేందుకు యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ సిద్ధమవుతోంది. పవర్‌ప్లాంట్ నిర్మాణం లో ఒక్కో ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేస్తున్న జెన్‌కో యంత్రాంగం విద్యుదుత్పాదన చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణను ఒక్కోటిగా నెరవేరుస్తోం ది.శుక్రవారం కీలకమైన యూనిట్-1 నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అ నుసంధానించే ప్రక్రియను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రారంభించారు.
జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఇప్పటి వరకు రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుదుత్పత్తికి లైన్‌క్లియర్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరునాటికి మిగిలిన మూడు యూనిట్లు కలిపి మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టడమేగాక దీన్ని గ్రిడ్‌కి అనుసంధానం చేసేందుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేస్తామని జెన్‌కో ఇంజనీర్లు శుక్రవారం జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టికి వివరించారు.
ముమ్మరంగా సాగుతున్న పనులు..
థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసువేశారు. ఈ కేసుతో పర్యావరణ అనుమతులను కేంద్ర పర్యావరణ సంస్థ నిలిపివేసి, ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 20న మరోసారి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టి ఆమోదం తీసుకొని ఆ వివరాలనే జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌కు అధికారులు నివేదించారు. అనంతరం గ్రీన్ ట్రైబ్యునల్ కేసును కొట్టివేయడంతో, కేంద్ర పర్యావరణ సంస్థ అదే ఏడాది జూలై 5న అనుమతులు మంజూరుచేసింది. దీంతో అప్పటి నుంచి పనుల వేగం పెరిగింది. రాష్ట్ర ఇంధనశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి స్వయంగా ప్రతీ వారం అధికారు లు, ఇంజనీర్లతో సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతికి లక్ష్యం విధించడంతో పనుల్లో వేగం పెరిగింది. మొత్తం ఐదు యూనిట్లకు శుక్రవారం నాటికి రెండు యూనిట్లకు సంబంధించి పూర్తి విద్యుదుత్పాదన ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్పత్తయ్యే విద్యుత్‌ను గ్రిడ్ కు సైతం అనుసంధానం చేశారు. యూనిట్-4కు సంబంధించి ఇప్పటికే సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తిచేయగా, ఈ నెలాఖరుకు సీవోడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) ప్రకటిస్తామని వెల్లడించారు. మూడో యూనిట్‌కు సంబంధించి వచ్చే సెప్టెంబరు నెలాఖరు కు సింక్రనైజేషన్ పూర్తిచేసి, అక్టోబరు నెలాఖరుకు సీవోడీ ప్రకటించాలని నిర్ణయించారు. చివరగా ఐదో యూనిట్‌ను డిసెంబరు నెలాఖరు నాటికి సింక్రనైజేషన్ పూర్తిచేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరునాటికి సీవోడీ ప్రకటించాలని ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. అదే సమయంలో రైల్వేలైన్ల నిర్మాణం, స్టాక్‌యార్డులు, ఫ్లైయాష్ రవాణా చర్యలు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. నవంబరు నెలాఖరునాటికి ప్లాంటు వద్ద రైల్వే యార్డుల పనుల పూర్తికి ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా ప్లాంట్ అధికారులు, సిబ్బంది నివాసాలకు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షి్‌పనకు డిప్యూటీ సీఎం భట్టి భూమిపూజ చేశారు. దీన్ని 2027 నవంబరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
పంద్రాగస్టులోగా ఉద్యోగాలు
జాతి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రగతి కోసం తరతరాలుగా కుటుంబాలకు ఆదరువైన భూములు ఇచ్చిన త్యాగధనులను ప్రభుత్వం గుర్తిస్తుందని, వారి కుటుంబాలకు అర్హతల మేరకు ప్లాంటులో ఉద్యోగాలిచ్చేందుకు కార్యాచరణ చేపట్టామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం మరోమారు ఉద్ఘాటించారు. అందులో భాగంగా ఇప్పటికే 112 మందికి ఉద్యోగాలిచ్చామని, మిగిలిన నిర్వాసితుల కుటుంబీకులందరికీ పంద్రాగస్టులోగా ఉద్యోగాలివ్వాలని జెన్‌కో ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చే అంశంపై ఇక్కడి నుంచే ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలివ్వడంపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ హర్షం వ్యక్తం చేయడంతో పాటు, అధికారులు ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కోరారు. ఈ ప్రకటన నిర్వాసితులకు ఊరట కలిగింది. ప్లాంటు కోసం సేకరించిన 4,676 ఎకరాల భూమికి సంబంధించి 573 మందికి ఉద్యోగ కార్డులు ఇచ్చారు. వీరిలో ఇళ్లు సైతం కోల్పోయిన కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే 112 మందికి ఉద్యోగాలు ఇవ్వగా, ఇళ్లు కోల్పోయినవారిలో ఉద్యోగార్హత కలిగిన మరో 21 మందికి, నిర్వాసితులు 440 మందికి కలిపి మొత్తం 473 మందికి ఈ ఆగస్టు 15లోగా ఉద్యోగాలిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. దీంతో ఆయా కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అదే సమయంలో పవర్‌ప్లాంటులో అటవీహక్కులు కలిగిన భూములు కోల్పోయిన మరో 290 కుటుంబాలకు సైతం ఉద్యోగావ అకాశాలు కల్పించాలని నిర్వాసితులు కోరుతున్నారు. అదేవిధంగా పెండింగ్ పరిహారాలు, ప్లాంట్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన కపూర్‌తండా, మోదుగులకుంటతండాలకు చెందిన గిరిజన కుటుంబాలకు ఏర్పాటు చేసిన ఆర్‌అండ్‌ఆర్ (పునరావాస పునర్నిర్మాణ కేంద్రం) సెంటర్లలో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కూడా దృష్టి సారించి పనులన్నీ పూర్తిచేయించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
అత్యవసరమైతే 30శాతం విదేశీ బొగ్గు
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ పనులు ప్రారంభించినప్పుడు 50శాతం విదేశీబొగ్గు, మరో 50శాతం స్వదేశీ బొగ్గుతో ప్లాంట్ నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అనంతర కాలంలో మొత్తం స్వదేశీ బొగ్గుతోనే నిర్వహిస్తామని, తప్పనిపరిస్థితి ఎదురైతే, ఏదైనా ప్రత్యేక సందర్భంలో 30శాతం మేర విదేశీ బొగ్గును వినియోగించే ప్రయత్నం చేస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.