Share News

మారనున్న ‘సహకార’ రూపు రేఖలు

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:09 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 106 సంవత్సరాల క్రితం రైతులకోసం రైతులతో ఏర్పడిన సహకార సంఘాల ను ఇక రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

మారనున్న ‘సహకార’ రూపు రేఖలు

పీఏసీఎ్‌సలను ఎఫ్‌పీవోలుగా మారుస్తూ ఉత్తర్వులు

ఇకపై సహకార సంఘాలు.. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు

తొలివిడతలో ఉమ్మడి జిల్లాలో 36 పీఏసీఎ్‌సల ఎంపిక

సహకార శాఖ పరిధిలోకి సొసైటీల మార్పుపై చర్చ

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 106 సంవత్సరాల క్రితం రైతులకోసం రైతులతో ఏర్పడిన సహకార సంఘాల ను ఇక రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పలు పీఏసీఎ్‌సలను ఎఫ్‌పీవో (ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌)లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే జిల్లా సహకార కేంద్ర బ్యాంకులోని పీఏసీఎ్‌సలు అన్నీ లాభాల బాటలో ఉండటంతోపాటు డీసీసీబీ దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్‌ చేరుకొని రాష్ట్రంలో ద్వితీయ స్థానానికి ఎదిగింది. ఇలాంటి సమయంలో లాభాల్లో ఉన్న పీఏసీఎ్‌సలను సహకార శాఖ పరిధిలోకి మార్చితే పీఏసీఎ్‌సలకు లాభం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

పీఏసీఎ్‌సల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయాలతోపాటు ధాన్యం కొనుగోలుతో లాభాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో సహకార శాఖకు సొసైటీలను బదలాయించడం వల్ల భవిష్యత్‌లో సొసైటీలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదన్న చర్చ సాగుతోంది. దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన ప్రాథమిక సహకార సంఘాల ను రైతు ఉత్పత్తిదారుల సంస్థగా మారుస్తూ కేంద్ర ప్ర భుత్వం రాష్ట్రంలోని 311 పీఏసీఎ్‌సలను ఎఫ్‌పీవోలుగా మార్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సొసైటీలను మార్పు చేయక తప్పలేదు.

సహకార శాఖకు నిర్వహణ సాధ్యమేనా..?

నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో సహకార శాఖ అధికారులు, ఉద్యోగులకు కొత్తగా రైతు ఉత్పత్తిదారుల సంస్థల బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఉద్యోగులు, సిబ్బంది కొరత ఉండగా, సహకార శాఖకు ఎఫ్‌పీవోల నిర్వహణ బాధ్యత ఎంతవరకు సాధ్యమవుతుందనే దానిపై సందేహాలు వ్యక్తవుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కొత్త సొసైటీల ఏర్పాటుపై కసరత్తు చేసిన సహకార అధికారులు ప్రస్తుతం ఆ పనులను నిలిపివేసినట్లు తెలిసింది. కొత్త సొసైటీలను ఏర్పాటు చేసినా ఉద్యోగులు, సిబ్బంది నియామకం చేపట్టే అవకాశం లేకపోవడంతో కొత్త సొసైటీల ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కొత్త సొసైటీలు ఏర్పడితే రైతులకు మరింత సేవలు అందించే అవకాశాలు ఉన్నా కొత్త నిమాయకాలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నిరంతరం పర్యవేక్షణచేసి సలహాలు సూచనలు ఎఫ్‌పీవోలకు ఇవ్వాల్సి ఉంటుంది. సొసైటీలను సమన్వయం చేసుకుంటూ ఎఫ్‌పీవోలు ఏవిధమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉందని, దానిపై ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ముందుకు సాగితే పీఏసీఎ్‌సల నుంచి ఎఫ్‌పీవోలుగా మారిన సొసైటీలు అభివృద్ధి సాధిస్తాయి. మొదటి విడత ఎంపికైన 36 ఎఫ్‌పీవోలు అభివృద్ధి సాధిస్తేనే మిగతా రెండు విడతల్లో సొసైటీలు రైతు ఉత్పతిదారుల సంస్థలుగా ఎంపికవుతాయి.

ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 36 సొసైటీలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 107సొసైటీలు ఉన్నాయి. తొలివిడత 36 సొసైటీలను ఎఫ్‌పీవోలుగా మార్చారు. నల్లగొండ జిల్లాలో 13, యాదాద్రి భువనగి రి జిల్లాలో 15, సూర్యాపేట జిల్లాలో 8 పీఏసీఎ్‌సలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని సొసైటీలు లాభాల బాటలోనే ఉన్నాయి. మొదటి విడత ఎంపికైన సొసైటీలు కూడా లాభాల బాటలో నడవడం విశేషం. ఇక కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందాలను చేసే ప్రక్రియను సహకార శాఖ ప్రారంభించనుంది. మరో రెండు విడతల్లో మిగిలిన 71 సొసైటీలను కూడా రైతు ఉత్పత్తిదారుల సంస్థల జాబితాలో చేర్చనున్నారు. వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రైతులకు మేలు చేకూర్చాలన్న ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం పీఏసీఎ్‌సలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా ఏర్పాటు చేయబోతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంస్థలద్వారా వ్యవసాయ పనిముట్లను తక్కువ ధరకు అందుబాటులో ఉంచడంతోపాటు పంట ఉత్పత్తులకు విలువలను జోడించడం, పం ట ఉత్పత్తులను అధికంగా లాభాలు వచ్చేలా మార్కెటింగ్‌ చేయడంతో అధిక ఆదాయం వచ్చే మార్గాలను పరిశీలించడం, విత్తనోత్పత్తిలాంటి కార్యక్రమాలను ఎఫ్‌పీవో చేపట్టనుంది.

మే 5 నుంచి పీఏసీఎ్‌సలు ఇక ఎఫ్‌పీవోలు

వచ్చే నెల 5వ తేదీ నుంచి ఎంపిక చేసిన ప్రాథమిక సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చి, ఆరోజు నుంచి కార్యకలాపాలను విస్తరింపజేయడంకోసం ప్ర ణాళికలను రూపొందించినట్లు సమాచారం. ఇందుకు మూడు జిల్లాల సహకార శాఖ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. క్లస్టర్లవారీగా నిర్వహణ, బేస్‌లైన్‌ సర్వే, ఏజెన్సీల అమలు, వ్యాపార ప్రణాళికల తయారీ, శిక్షణ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం సహకార యూనియన్లకు అప్పగించింది. ఎఫ్‌పీవోలుగా మారిన పీఏసీఎస్‌ సభ్యులకు రూ.15లక్షలవర కు మ్యాచింగ్‌ గ్రాంటును కూడా మంజూరు చే స్తుంది. ఎఫ్‌పీవోలు నిలదొక్కుకోవడానికి ఏడాదికి రూ.6లక్షల చొప్పున మూడేళ్లలో రూ.18లక్ష ల వరకు ఆయా రైతు ఉత్పత్తిదారుల సంస్థల కు చెల్లిస్తారు. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ నిధి కింద నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఎన్‌సీడీసీ, నాబార్డు ద్వారా ఈపథకాన్ని అమల్లోకి తీసుకరానున్నారు. సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారు సంస్థలు వేర్వేరు లక్ష్యాలతో ఉన్నా, ఇవి రెండు ఒకేరకమైన సంస్థలే. ఎఫ్‌పీవోలు ప్రధానంగా రైతుల ఆదాయం పెంచడానికి, ఉత్పత్తులను పెంచడానికి ప్రాసెసింగ్‌ చేయడానికి దృష్టిసారించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పీఏసీఎ్‌సలను కూడా రైతుల సంక్షేమంకోసం రైతులకు అధిక లాభాలు సమకూర్చడంకోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభు త్వం చెబుతున్న ప్రకారం ఎఫ్‌పీవోల ప్రధాన లక్ష్యం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, వారికి ఆదాయం సమకూర్చడం బాధ్యత అని పేర్కొంటుంది. అయితే రాబోయే రోజుల్లో పీఏసీఎ్‌సలతోపాటు ఎఫ్‌పీవోలు సమన్వయంతోనే పనిచేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో ఉండే పీఏసీఎ్‌సలను కేంద్రం జిల్లా సహకార పరిధిలోకి మార్చి ఎఫ్‌పీవోలుగా రూపాన్ని మార్చడంతో రాబోయే రోజుల్లో ఎఫ్‌పీవోలు ఏ విధంగా పనిచేస్తాయనేది వేచి చూడాల్సిందే.

రైతు ఉత్పత్తి దారుల సంస్థల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ : పత్యానాయక్‌, డీసీవో, నల్లగొండ

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పీఏసీఎ్‌సలు ఎఫ్‌పీవోలుగా ఏర్పడ్డాయి. ఈ 10 రోజుల్లోపే రైతు ఉత్పత్తిదారుల సంస్థలు సేవలు, బాధ్యతలు నిర్వహించనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశాం. పీఏసీఎల్‌లను ఎఫ్‌పీవోలుగా మారుస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. మరో రెండు విడతల్లో మిగతా సొసైటీలను కూడా ఎఫ్‌పీవోలుగా మార్చారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతం వల్ల రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Apr 28 , 2025 | 12:09 AM