Share News

పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:50 PM

సీపీఎం జిల్లా నాయకుడు చింతల భూపాల్‌రెడ్డి అందించిన పోరాట స్ఫూర్తితో పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా నాయకుడు దండ అరుణ్‌ కుమార్‌ అన్నారు.

 పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం
ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న కార్యకర్తలు

చౌటుప్పల్‌ టౌన, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీపీఎం జిల్లా నాయకుడు చింతల భూపాల్‌రెడ్డి అందించిన పోరాట స్ఫూర్తితో పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా నాయకుడు దండ అరుణ్‌ కుమార్‌ అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలోని పలు వార్డుల్లో బుధవారం రాత్రి భూపాల్‌ రెడ్డి చిత్రపటానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులను వెలిగించారు. పట్టణానికి భూపాల్‌ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమాల్లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ.పాషా, నాయకులు బండారు నర్సింహ, జి.లక్ష్మణ్‌, కె.శివకుమార్‌, ఆనంద్‌, రేష్మా, జి.ఐలయ్య, పాండు, ఖయ్యూమ్‌, జానీబాయి, దాసు, రాములు, రహీమ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రమేష్‌, జంగయ్య, హమీద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 11:50 PM