ఎర్రజెండాతో సమస్యలు పరిష్కారం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:37 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడేది ఎర్రజెండా ఒక్కటేనని మాజీ ఎమ్మె ల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. జిల్లాలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం భువనగిరి సుందరయ్యభవన్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు.

పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు
భువనగిరి (కలెక్టరేట్), ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యో తి): ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడేది ఎర్రజెండా ఒక్కటేనని మాజీ ఎమ్మె ల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. జిల్లాలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం భువనగిరి సుందరయ్యభవన్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ఒకటి రెండు మాత్రమే అమలు చేసిన ప్రభుత్వం మిగతా వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. జిల్లాలో ఎంతోమంది అర్హులై ఉన్న ప్రజలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తులు చేసుకుంటే మంజూరు చేయక పోవడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే చిన్ననీటి ప్రాజెక్టులు బస్వాపూర్ రిజార్వాయర్, పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలను పూర్తిచేయాలని గంధమల్ల ప్రాజెక్టు పనులను చేపట్టాలన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కరువయ్యాయని, అందుబాటులో ఉన్న ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అంతేకాకుండా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వరి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో కమిటీలు నిర్ణయించిన పేర్లను కాకుండా గ్రామసభల్లో ఎంపిక చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు. మహాధర్నాలో బాలరాజు, మల్లేశం, పాండు, పెంటయ్య, చారి, చంద్రారెడ్డి, కృష్ణ, స్వామి, వెంకటేష్, రాజు, లెనిన్, అంజయ్య, జగన్, ముత్యాలు, శివ తదితరులు ఉన్నారు.