‘భూభారతి’తో భూ సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:35 AM
భూ సమస్యలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

సంస్థాన్‌నారాయణపురం, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): భూ సమస్యలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలకేం ద్రంలో సోమవారం సాయంత్రం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ భూములను నమ్ముకుని సా గు చేస్తున్న రైతులకు అన్యాయం జరగదని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. జిల్లాల విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని, రాజకీయ అ వసరాల కోసం విభజించారని ఆరోపించారు. పరిపాలన సౌలభ్యంకోసం, ప్రజల కోసం కొత్త జిల్లాలు ఏర్పడాలి కానీ బలమైన రాజకీయ నా యకుల ప్రాంతాన్ని చీల్చడానికే కేసీఆర్ జిల్లాలు ఏర్పాటు చేశారని విమర్శించారు. ధరణిలో మ్యు టేషన్ చేయడానికి సవాలక్ష సమస్యలు ఉండేవన్నారు. రాచకొండ ప్రాంతంలో ఎన్నో రకాల భూ సమస్యలు ఉన్నాయని, రైతులకు, పోలీసులు అటవీ అధికారులతో వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రస్తుతం వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. రెవె న్యూ కార్యాలయాల్లో డబ్బులు లేనిదే పని జరగ దనే అపవాదు ఉందని, దానిని రూపుమాపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. గత ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఒక్క ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాయని తెలిపారు. శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రాచకొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లోని ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు.
పేదల సమస్యల పరిష్కారానికే..: నెల్లికంటి
పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చిందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. భూ స్వాములు, పెట్టుబడుదారులకు ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం ధరణి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రాచకొండలో గిరిజనులు, రైతులు, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ భూసమస్యలకు సంబంధించి రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కొత్త చట్టంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించారని తెలిపారు.
‘భూ భారతి’పై అవగాహన అవసరం
మోటకొండూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన అవసరమని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మోటకొండూరు మండల కేంద్రంలోని జడ్పీహైస్కూల్ ఆవరణలో సోమవారం భూభారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఒక్క రూపాయి ఫీజు లేకుడా భూసమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవోలు శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీడీవోలు ఇందిర, తహసీల్దార్లు నాగదివ్య, శ్రీనివా్‌సరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చిమట్ల మదార్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు యెల్లంల సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు గంగపురం మల్లేష్, ఏవో రమాదేవి, నాయకులు కొంతం మోహన్‌రెడ్డి, తండ పాండురంగయ్య గౌడ్, జహంగీర్, కొమురయ్య, గుత్త ఉమాదేవి, బచ్చనగోని గాలయ్య, బుజ్జి, యాదవరెడ్డి, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.