Share News

నేటి నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:55 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలోని గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతుల ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. విద్యాశాక ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఖాళీలను ప్రకటించి అర్హులైన టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నారు.

నేటి నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ

11లోగా పూర్తికి విద్యాశాఖ సన్నాహాలు

నల్లగొండ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలోని గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతుల ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. విద్యాశాక ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఖాళీలను ప్రకటించి అర్హులైన టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నారు. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 120 మంది వరకు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందే అవకాశం ఉంది.

షెడ్యూల్‌ ఇలా..

ఈ నెల 2న వెబ్‌సైట్‌లో ఖాళీల ప్రదర్శన

3న సీనియార్టీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ

4, 5వ తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితా వెల్లడి

6న ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి వెబ్‌ ఆప్షన్ల స్వీకరణ

7న పదోన్నతుల ఉత్తర్వుల జారీ, ఖాళీల ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ

8న ఎస్జీటీ సీనియార్టీ తుది జాబితా విడుదల

10న స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు ఎస్జీటీలకు వెబ్‌ఆప్షన్‌ ప్రక్రియ ప్రారంభం

11న ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఉత్తర్వుల జారీ

Updated Date - Aug 02 , 2025 | 12:55 AM