తైక్వాండోతో శారీరక, మానసిక దృఢత్వం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:22 AM
తైక్వాండో శారీరక, మానసిక ధృడత్వానికి దోహదపడుతుందని భువనగిరి పట్టణ సీఐ రమేష్ అన్నారు.
భువనగిరి గంజ్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : తైక్వాండో శారీరక, మానసిక ధృడత్వానికి దోహదపడుతుందని భువనగిరి పట్టణ సీఐ రమేష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని హ్యూమన సెల్ఫ్ డిఫెన్స అకాడమీ ఆధ్వర్యంలో వరల్డ్ అకాడమీకి హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు ఆత్మరక్షణలో భాగమైన తైక్వాండో క్రీడ నేర్చుకోవడం ద్వారా శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండవచ్చుని, సరైన ఆహారపు అలవాట్లను కూడా అలవాటు చేసుకోవాలని సూచించారు. భవిష్యత తరాలకు తైక్వాండో క్రీడ ఎంతో ఉపయోగపడుతుందని, క్రీడాకారులు జిల్లా పుండి రాష్ట్ర స్థాయికి క్రీడాకారులుగా ఎదగాలని వారు కోరారు. కార్యక్రమంలో తైక్వాండో మాస్టర్ మల్లేష్, శివ ప్రసాద్, రాధ, భరతకుమార్, ప్రపుల్‌రెడ్డి, క్రీడాకారులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.