నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:45 PM
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురువారం (నేటి నుంచి) చేపట్టే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్డీవో కృష్ణారెడ్డి మండల ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
ఆత్మకూరు(ఎం) నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురువారం (నేటి నుంచి) చేపట్టే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్డీవో కృష్ణారెడ్డి మండల ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. మండల పరిషత కార్యాలయంలో ఆర్వో, ఏఆర్వోలకు బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్డీవో మట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటింస్తూ, నామినేషన్ల స్వీకరణ ప్రక్రి య సజావుగా కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 23 గ్రామపంచాయతీలకు గాను ఆత్మకూరు, కూరెళ్ల, కప్రాయిపల్లి, రహీంఖానపేట, సింగారం, పల్లెర్ల, రాయిపల్లి, పల్లెపహడ్, గ్రామాలను క్లస్టర్లుగా విభజించినట్లు తెలిపారు. మండలంలో 5 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. గురువారం ఉదయం 10.30 నిమిషాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని, అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే స్వీకరణ కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. నామినేషన కేంద్రాలకు 100మీటర్ల దూరంలో వాహనాలను నిలపాలని, సూచించారు. సమావేశంలో ఎంిపీడీవో రాములు నాయక్, సూపరింటెండెంట్ జగదీశ్వర్‌రెడ్డి, ఏఆరై వెంకటేశ్వర్లు, ఎంపివో శ్యామ్‌కుమార్, ఆర్వోలు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలంలోని 23 గ్రామ పంచాయతీలు 198 వార్డులకు గురువారం నుంచి నామినేషన్ల పక్రియ కొనసాగుతుందని స్థానిక ఎంపీడీవో నవీన్ కుమార్ తెలిపారు. బుధవారం గుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27నుంచి 29 వరకు ఉదయం 10-30 గంటల నుంచి 5 సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ పోటీ అభ్యర్థుల దాఖలు చేయొచ్చని చెప్పారు. మండలంలో నామినేషన్లు వేయడానికి ఐదు కస్టర్లు ఏర్పాటు చేయగా అందులో దాతరుపల్లి క్లస్టర్‌లో జంగంపల్లి, రాళ్ల జనగాం, మల్లాపురం, దాతరుపల్లి, గౌరాయిపల్లి క్లస్టర్‌లో కాచారం, సాదువెల్లి, కంటంగూడెం, ఽధర్మారెడ్డిగూడెం, చిన్న, పెద్ద గౌరాయిపల్లి, పెద్దకందుకూర్‌లో బాహుపేట, తాళ్లగూడెం, చిన్నకందుకూర్, రామాజీపేట, వంగపల్లిలో మహబూబ్‌పేట, మర్రిగూడెం, చొల్లేరు, వంగపల్లి గ్రామాల్లో నామినేషన్ వేస్తారని ఆయన వివరించారు. నామినేషన్లకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని ఎన్నికలు ు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు.
బొమ్మలరామారం: మండలంలోని 35 గ్రామ పంచాయతీలు గాని మొదటి విడతలో జరిగే ఎన్నికలకు నేటి నుంచి ఏర్పాటు చేసిన కౌంటర్లలో నామినేషన స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో రాజా త్రివిక్రమ్ తెలిపారు. బుధవారం మండల పరిషత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ మండలంలోని 35 గ్రామ పంచాయతీలు, 284 వార్డులకు జరిగే ఎన్నికల్లో 29503 ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్స్ నామినేషన స్వీకరణ కోసం వివిధ గ్రామాల్లో 11 సెంటర్లు ఏర్పాటు చేశారు. బొమ్మలరామారంలో బొమ్మలరామారం, హాజీపూర్, మల్యాల. రాంలింగంపల్లిలో రాంలింగంపల్లి, పెద్దపర్వతాపూర్, రంగాపురం. కండ్లకుంట తండాలో గోవింద్‌తండా, వాలుతం డా, కండ్లకుంట తండా. చీకటిమామిడిలో చీకటిమామిడి, కాజీపేట్, రామస్వామి తండా. మర్యాలలో మర్యాల, పిల్లిగుండ్ల తండా, చౌదర్‌పల్లి. చామనపల్లిలో నాయకునితండా, మాచనపల్లి, లక్ష్మీతండా. తిమ్మాపూర్‌లో తిమ్మాపూర్, కంచితండా, బోయినపల్లి. ప్యారారంలో ప్యారారం, మునీరాబాద్, సోలిపేట. మేడిపల్లిలో మేడిపల్లి, ఫక్కీర్‌గూడెం, మైలారం కింది తండా, మైలారం. నాగినేనిపల్లిలో నాగినేనిపల్లి, తిరుమలగిరి, మైసిరెడ్డిపల్లి. జలాల్‌పూర్‌లో జలాల్‌పూర్, బండకాడిపల్లి, యావాపూర్ తండా, తూంకుంట అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.