మోహనసాయి.. అనుగామి ఆసో్ట్రనాట్
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:23 PM
భారత అంతరిక్ష స్వదేశీ అన్‌లాగ్ మిషన్ అనుగామిలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన ఆకుల మోహన్‌సాయి శిక్షణ పూర్తి చేసుకున్నారు.

స్వదేశీ మిషనలో భాగస్వామ్యం ఫ ఇది ఆయనకు మూడో మిషన
(ఆంధ్రజ్యోతి - హుజూర్‌నగర్)
భారత అంతరిక్ష స్వదేశీ అన్‌లాగ్ మిషన్ అనుగామిలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన ఆకుల మోహన్‌సాయి శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ మిషనలో ఆయన ఆసో్ట్రనా ట్‌గా శిక్షణ పొందారు. ఈ మిషనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి మోహనసాయి. ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన అనుగామి మిషన్‌లో 10 రోజుల పాటు స్వదేశీ శిక్షణ, ఎంపిక, మానసిక స్థితి, మూల్యాంకన విధానాలపై శిక్షణ జరిగింది. ఈ విశిష్ఠమైన మిషన్‌ను సైంటి్‌స్ట-ఎఫ్ విభాగాధిపతి, ఏవియేషన్ సైకాలజిస్ట్ డాక్టర్ సౌగంధి చతుర్వేదుల ఆధ్వర్యంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరో స్పేస్ మెడిసిన్(ఐఏఎం)లోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైకాలజీ(సీఏఆర్) రూపకల్పన చేసింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి విజయవంతంగా అమలుచేశారు.
గతంలో రెండు మిషనలలో
మోహన్‌సాయి ఇంతకుముందు రెండు అంతర్జాతీయ లునార్ అన్‌లాగ్ వ్యోమగామి మిషన్‌లో పాల్గొన్నారు. 2023లో 10 రోజులు లునార్ అన్‌లాగ్‌మిషన్, 2024 పొలాండ్‌లో 19 రోజులు అంతర్జాతీయ లునార్ అన్‌లాగ్‌మిషన్‌లో శిక్షణ పొందారు. ప్రస్తుతం భారతదేశ మొట్టమొదటి స్వదేశీ అన్‌లాగ్‌మిషన్ ‘అనుగామి’లో పాల్గొనడం ద్వారా మూడో అనలాగ్ మిషనను పూర్తి చేశారు. భారత్‌లో మొదటి మిషన్‌గా గుర్తింపు పొందిన అనుగామి మిషనలో మానవ మానసిక పరిస్థితులు, సహజవాతావరణ వ్యతిరేక ప్రభావాలు, శారీరక సహన సామర్థ్యాలపై ఆయన చేస్తున్న పరిశోధనలు భారత అంతరిక్ష రంగానికి ఎంతో దోహదపడుతున్నాయి.
10 రోజుల ఐసోలేషన
ఈ మిషన్‌లో శాస్ర్తీయంగా రూపొందించిన స్పేస్ ఫ్లైట్ సిమ్యులేషన్ తరహాలో రూపొందించారు. మిషనలోని సభ్యులు 10 రోజుల పాటు 250 గంటల పాటు ఐసోలేషన్(మూసివేత) పరిస్థితిలో ఉండి అంతరిక్ష ప్రయాణంలో ఎదురయ్యే మానవ కార్యకలాపాలు, మానసిక ధైర్యం, అత్యవసర పరిస్థితుల నిర్వహణను పర్యవేక్షిస్తారు. ఇదే అంశంపై శిక్షణలో ఉన్న మోహన్‌సాయి సిమ్యులేషనలో 10 రోజుల పాటు ఉన్నారు. రాష్ట్రం నుంచి స్వదేశీ అనలాగ్‌మిషన్ అనుగామికి ఎంపికైన శిక్షణ పూర్తి చేసిన మోహన్‌సాయి ప్రస్తుతం భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరో స్పేస్ మెడిసిన్‌లో రీసెర్చ్ సైంటిస్ట్-1(నాన్‌మెడికల్)గా విధులు నిర్వహిస్తున్నారు.
వీటిపైనే పరిశోధనలు
అనుగామి మిషన్‌లో మానసిక స్థైర్యం(రెస్లినెస్), మానసిక ఆరోగ్య పర్యవేక్షణ (మెంటల్ హెల్త్‌మానిటరింగ్), మైండ్‌ఫుల్‌నెస్ వంటి అంశాలపై ప్రత్యేక శాస్ర్తీయతపై పరిశోధనలు చేశారు. అంతేకాకుండా శరీరంలో రక్తప్రసరణ మార్పులను అధ్యయనం చేసేందుకు ఏడురోజుల హెడ్‌డౌన్ టిల్ట్ బెడ్‌రెస్ట్ ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగం అంతరిక్ష శరీర శాస్త్రం, ఆరోగ్య నిర్వహణ పద్ధతులపై అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది.
క్రూలో మోహనసాయి ఆసో్ట్రనాట్
అనుగామి మిషన క్రూలో ఒక్కొక్కరు ఒక్కో విభాగానికి చెందిన వారుంటారు. అంతరిక్ష యానంలో ఉండి ప్రతీ విభాగానికి చెందిన వారు ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటారు. అనుగామిలో కెప్టెన్ అగంద్ ప్రతా్‌ప(ఐఎ్‌సఆర్‌వో) అనుభవజ్ఞుడైన టెస్ట్ ఫైలెట్‌తో పాటు గగన్‌యాన్‌కు ఎంపిన వ్యక్తి. అత్యవసరాలలో బతకగలగడంలో నిపుణుడు సీడీఆర్ రాజీవ్ ప్రసన్న(ఇండియన్ నేవీ), ఆయన నౌకాదళ మిగ్-29కే యుద్ధ విమాన పైలెట్. వీరితో పాటు ఆకుల మోహన్‌సాయి అంతరిక్ష శాస్త్ర పరిశోధకుడిగా, అన్‌లాగ్ ఆస్ర్టోనాట్‌గా మిషనలో శిక్షణ పొందారు.
భవిష్యతలో ఆస్ర్టోనాట్ అయ్యేందుకు
హుజూర్‌నగర్‌కు చెందిన ఆకుల మోహన్‌సాయి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. మూడుసార్లు అన్‌లాగ్ మిషన్‌లో శిక్షణ పొందిన మోహన్‌సాయి బెంగుళూరులోని వైమానిక దళానికి చెందిన ఐఏఎంలో విధులు నిర్వహిస్తున్నారు. భారత అంతరిక్ష సంస్థలో పనిచేసేందుకు అవకాశాలు వచ్చిన నేపథ్యంలో 2035, 2040లో నిర్వహించనున్న అంతరిక్ష యానంలో అవకాశాల కోసం నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు.