Share News

మామిడీలా

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:34 AM

మామిడి దిగుబడి జిల్లాలో ఈ సారి గణనీయంగా తగ్గింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో పూత కూ డా ఆలస్యంగా వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మామిడిచెట్లకు కాసిన పూత కొంతమేరకు రాలిపోయింది.

మామిడీలా

తగ్గిన ఫలరాజు దిగుబడి

23వేల టన్నులకు 18వేలే ఉత్పత్తి

ప్రియం కానున్న మామిడి

వాతావరణ మార్పులు, వర్షాభావంతో ఎండుతున్న తోటలు

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): మామిడి దిగుబడి జిల్లాలో ఈ సారి గణనీయంగా తగ్గింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో పూత కూ డా ఆలస్యంగా వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మామిడిచెట్లకు కాసిన పూత కొంతమేరకు రాలిపోయింది. దీనికి తోడు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయా యి. ఒకప్పుడు మూడు ఇంచుల వరకు పోసే బోర్లు ఇం చునీరు రావడంలేదు. దీంతో జిల్లాలో పలుప్రాంతాల్లో ఉన్న మామిడి తోటలు ఎండుముఖం పడుతున్నాయి.

ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షంతో మామిడికాయలు నేలరాలాయి. జిల్లాలోని 17 మండలాల్లోనూ మామిడి తోటలు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని తుర్కపల్లి, రాజాపే ట, బొమ్మలరామారం, భువనగిరి, బీబీనగర్‌ మండలాల్లో అధికంగా మామిడితోట లు ఉన్నాయి. జిల్లాలోని తుర్కపల్లి, రాజపేట, బొమ్మలరామారం, గుం డాల, ఆత్మకూరు(ఎం), తదిత ర మండలాల్లో వడగండ్ల వర్షాలకు చెట్లపై కొమ్మలు, కాయలు లేకుండా రాలిపోయా యి. జిల్లాలో ప్రధానంగా బంగినపల్లి, దసేరి, రసాలు వంటి మామిడి పండ్లను ఎక్కువగా పండిస్తారు. జిల్లా వ్యాప్తంగా 11వేల ఎకరాల్లో మామిడిని సాగు చేస్తున్నా రు. పూతకు రాని ఐదేళ్లలోపు ఉన్న మామిడి చెట్లు మరో 2వేల ఎకరాల వరకు ఉన్నాయి. ప్రతీ సంవత్స రం జిల్లానుంచి దాదాపు 23వేల మెట్రిక్‌ టన్నుల మామిడి పంట దిగుబడి అవుతుంది. కానీ ఈసారి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం, నీటి ఎద్ద డి, వర్షాభావ పరిస్థితులుతో 18వేల టన్నుల మామిడి దిగుబడి అయ్యే అవకాశం ఉందని ఉద్యాన అధికారు లు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల వీచిన గాలి దుమారాలకు చెట్లపై ఉన్న సగం కాయలు రాలిపోయాయి. ఇటు వాతావరణం, అటు కరువు పరిస్థితుల నడుమ మామిడి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మామిడి తోటలను లీజుకు తీసుకు న్న వారు కూడా ఈ సారి తీవ్ర నష్టాల ను చవిచూస్తున్నారు. తోటల్లో కాయలు అనుకున్నంత సైజులో పండకపోవడం తో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లకు సరిగ్గా నీరు లేకపోవడంతో కాయల పరిమాణం తగ్గింది. మామిడి పండ్లు ఈ సారి జిల్లా ప్రజలు మరింత ప్రియంకానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో మామిడిపండ్ల ధరలకు లెక్కలొచ్చాయి. రైతుల వద్ద తక్కువ ధరకు తీసుకుని వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో గతం కంటే మామిడి పండ్ల ధరలు పెరిగిపోయాయి.

పోషక విలువలు ఉత్పత్తి కావు

మామిడి కాయలు పరిపక్వానికి రాకముందే కార్బెడ్‌ ఉపయోగించి మగ్గించిన పండ్లు తినడం ద్వారా తీవ్ర అనారోగ్యం పాలవుతారని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిపక్వానికి రాని మామిడికాయల్లో పోషక విలువలు ఉత్పత్తి కావు. దీంతో పండ్లు రుచికరంగా కూడా ఉండవు. మామిడి చెట్టుకు పండ్లు పరిపక్వానికి వచ్చిన వెంటనే లెంటిసెల్స్‌ కన్పిస్తాయి. కాయ తొడిమే దగ్గర పసుపుపచ్చని రంగు ఏర్పడుతుంది. మామిడికాయపై చుక్కలు పెద్దగా వస్తాయని వ్యవసాయశాస్త్రవేత్తలు పే ర్కొంటున్నారు. మామిడి కాయ పరిమాణం కూడా బాగా పెరుగుతుంది. మామిడి పంటపై పూర్తి అవగాహన ఉన్న రైతులు పక్వానికి వచ్చిన విషయాన్ని గ్రహిస్తారని, కాయ పరిమాణాన్ని గుర్తించి పండ్లు కోస్తారు. పరిపక్వానికి వచ్చిన మామిడి కాయలను మగ్గించేందుకు ఆహార సలహా కమిటీ సూచించిన మేరకు ఇథెరెల్‌ అనే మందును ఉపయోగిస్తే ఎలాంటి రోగాలు రావు. పరిపక్వానికి రాని పండ్లలో చెక్కర శాతం ఉత్పత్తి కాక రుచికరంగా కూడా ఉండవు. పరిపక్వానికి వచ్చిన మామిడి కాయను ఒక చోట చేర్చి, ఇథెరెల్‌ 200 పీపీఎం వరకు కాయలపై పిచికారీ కాని, కుప్పల్లో ఒక మూలన గిన్నెలో పెడితే పండ్లు మగ్గుతాయి. కార్బెడ్‌ ఉపయోగించిన పండ్లను తిం టే వాంతులు, విరేచనాలు, చర్మ, గొంతు, జలుబు, ము క్కు, కళ్లకు సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా అజీర్ణత ప్రభావం కూడా ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్బెడ్‌ ఉపయోగించిన మామిడి పండ్లను తినకూడదని సూచిస్తున్నారు.

రసాయన మామిడి పళ్లతో ముప్పు

మరోవైపు వ్యాపారులు పక్వాని కి రాని కాయలను రసాయనాలతో పండ్లు గా మారేలా చేస్తున్నారు. అవి కొనుగోలు చేసి తి న్నవారు మాత్రం రోగాలబారిన పడతారు. దీంతో ఈ మామిడి పండ్ల సీజన్‌లో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లనుం ది. పరిపక్వంలేని మామిడి కాయల్లో కాల్షియం కార్బైడ్‌ ఉపయోగిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకోనున్నట్లు ఉత్వర్వులు జారీచేశారు. మార్కెట్‌లో పరిపక్వానికి వచ్చిన మామిడి పండ్లను మాత్రమే విక్రయించాలని, లేదంటే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈఉత్తర్వులను వ్యాపారులు కచ్చితంగా పాటించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మామిడి పంట దెబ్బతిన్నది :సుభాషిణి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి

జిల్లాలో ఇటీవల తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజపేట, తదితర మండలాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసింది. దీంతో మామిడి పంట నేలరాలింది. వాతావరణాన్ని బట్టి కాత ఒక్కో సీజన్‌లో అధికంగా, తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈసారి కురిసిన వర్షాలకు పలు మండలాల్లో కాయలు, పూత నేలరాలడంతో మామిడి దిగుబడి కొంతమేరకు తగ్గనుంది. పంటనష్టంపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపాం.

Updated Date - Apr 29 , 2025 | 12:34 AM