Share News

రసవత్తరంగా ఎడ్లపందేలు

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:42 AM

మఠంపల్లి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలకేంద్రంలోని శుభవార్త ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్లపందేలు సోమవారం రసవత్తరంగా కొనసాగాయి.

రసవత్తరంగా ఎడ్లపందేలు

మఠంపల్లి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలకేంద్రంలోని శుభవార్త ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్లపందేలు సోమవారం రసవత్తరంగా కొనసాగాయి. మొదటి రోజు శనివారం నిర్వహించిన నాలుగు పండ్ల విభాగంలో నిర్వహించిన బండలాగుడు బల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశలోని ఉమ్మడి గుం టూరు జిల్లా గిత్తలు సత్తాచాటి ఆరుస్థానాలు 1,3,4,5,6,7 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన ఆరు పండ్ల విభాగంలో ప్రకాశం, గుంటూరు, సూర్యాపేట, నల్లగొండ పల్నాడు, విజయనగరం, బాపట్ల జిల్లాలకు చెందిన 12జతలు పోటీల్లో పాల్గొన్నాయి. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోటీలు జరుగుతున్నాయని శుభోదయ యువజన సంఘం గాదె జయభరతరెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన కేటగిరీ విభాగంలో మొత్తం 12జతలు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తాగునీరు, వసతి, భోజన సదుపాయాలను కమిటీ సభ్యు లు కల్పిస్తున్నారు. పోటీలను తిలకించేందుకు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రేక్షకులు తరలిరావడంతో పోటీలు నిర్వహిస్తున్న వీవీ మైదానం కోలహలంగా మారింది. కార్యక్రమంలో ఫాదర్‌ వినోద్‌రెడ్డి, ఆదూరి మధుసూదనరెడ్డి, శౌరెడ్డి, జడ్డు జల బాల్‌రెడ్డి, కె.చిన్నపురెడ్డి, భాస్కర్‌రెడ్డి, బాలశౌరెడ్డి, గాదె పవనరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రంజితరెడ్డి, సిస్టర్‌ రూబీ, సుజాత, అలంబాల్‌రెడ్డి, అంతోనరెడ్డి, లూర్దురెడ్డి, చర్చి పెద్దలు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పోటీల్లో ఆరు పండ్ల విభాగంలో నిర్వహించిన పోటీల్లో పల్నాడు జిల్లాకు చెందిన ఓసరారెడ్డి గిత్తలు మొదటి బహుమతి, ఆర్‌కే బుల్బుల్‌ అత్తోటరికిపా చౌదరి, శివరామకృష్ణచౌదరి గిత్తలు రెండో బహుమతి, బాపట్ల జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్‌, యాతేచిలుకూరి నాగేశ్వరావు గిత్తలు మూడో బహుమతి, అనంతనేని కాశ్య కృష్ణాజిల్లా నాలుగో బహుమతి, మేక అంజిరెడ్డి గిత్తలు ఐదో బహుమతి, ఖాసీంవలీ ప్రకాశం జిల్లా ఆరో బహుమతి, సూరా పూజితరెడ్డి ప్రకాశం జిల్లా ఏడో బహుమతి, బత్తుల శ్రీనివాస్‌ ఎనిమిదో బహుమతి, కేఎ్‌సరెడ్డి బుల్స్‌ నలమాద ఉత్తమ్‌పద్మావతిరెడ్డి కోదాడ తెలంగాణ గిత్తలు తొమ్మిదోబహుమతి, పల్నాడు జిల్లాకు చెందిన జాలే హనుమంతరావు గిత్తలు పదో బహుమతి గెలుచుకున్నట్లు యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారతరెడ్డి తెలిపారు. విజేతలకు దాతలు, నాయకులు, నిర్వాహకులు షీల్డ్‌, నగదుతో పాటు శాలువాతో సత్కరించారు.

Updated Date - Apr 29 , 2025 | 12:42 AM