కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జయరాములు
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:20 AM
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన బొలగాని జయరాములు సోమవారం రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మోటకొండూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన బొలగాని జయరాములు సోమవారం రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కల్లు గీత కార్మికుల సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తూ వారి హక్కుల సాధన కోసం వారిని చైతన్యం చేస్తూ ఉద్యమాలను నిర్వహించడంలో ముందు వరుసలో ఉంటానని అన్నారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.