ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:11 AM
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అధికారులను ఆదేశించారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు, పెద్దగూడెం తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ ఎం. హనుమంతరావు
భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అధికారులను ఆదేశించారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు, పెద్దగూడెం తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని చోట వెంటనే ప్రారంభించాలన్నారు. మండలంలో అతిపెద్ద కొనుగోలు కేంద్రాలైన పెద్దగూడెం, జూలూరు తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రాంభించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగేశ్వరరావు, ఆర్‌ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి
అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని మండలంలోని వంకమామిడి గ్రామంలో పర్యవేక్షించి లబ్ధిదారులతో మాట్లాడారు. తన ఇంటి బేస్‌మెంట్ పూర్తికాగానే రూ.లక్ష తన ఖాతాలో జమ అయ్యాయని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు రాములు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపి, పూర్తి నిర్మాణం అనంతరం గృహ ప్రవేశానికి రావాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో 40 ఇళ్ల నిర్మాణాలకు బేస్‌మెంట్ వరకు పూర్తి కావడానికి చొరవ చూపిన అధికారులను అభినందించారు.
నేటి ‘ప్రజావాణి’ రద్దు : కలెక్టర్
భువనగిరి (కలెక్టరేట్): ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆర్వోఆర్ చట్టంపై అవగాహన సదస్సులు ఉన్న నేపథ్యంలో సోమవారం(నేడు) కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.