ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:20 AM
స్థానిక ఎన్నికల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని జిల్లా పరిషత సీఈవో శోభారాణి కోరారు.
సంస్థాన నారాయణపురం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని జిల్లా పరిషత సీఈవో శోభారాణి కోరారు. మండల కేంద్రంలోని మండల పరిషత కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై గురువారం జిల్లా పరిషత సీఈవో శోభారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్టేజి 2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఎంపీఓ నరసింహారావు, టైన్రింగ్ అధికారులు నరేందర్ రెడ్డి, యాదిరెడ్డి పాల్గొన్నారు.