Share News

రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:11 AM

రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌కార్డులను పంపిణీ చేస్తామన్నారు.

రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ

పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యో తి): రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌కార్డులను పంపిణీ చేస్తామన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదని, దారిద్య్రరేఖకు దిగువనున్న అందరికీ రేషన్‌ కార్డు లు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భువనగిరి నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాల్వల పనులు కొనసాగుతున్నాయన్నారు. మిగిలిపోయిన కాల్వలకు భూసేకరణ ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా నిధులు అందిస్తామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల పై దృష్టి పెట్టలేదన్నారు.

ప్రతి పేదవాడు కడుపునిండా అన్నం తినాలనే గొప్ప లక్ష్యంతో రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరా ల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రట రీ డీఎస్‌ చౌహాన్‌, కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ భా స్కర్‌రావు, జిల్లా గ్రంథాల య పరిషత్‌ చైర్మన్‌ అవేజ్‌చిస్తి, మార్కెట్‌ చైర్మన్‌ రేఖా బాబురావు, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారు లు పాల్గొన్నారు.

సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు

ఆలేరు: ధనికులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందించడం దేశంలోనే గొప్ప విప్లవాత్మక మార్పు అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఆలేరు లో జరిగిన నియోజకవర్గ స్థాయి ఆహార భద్ర త కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రులు హాజరై మాట్లాడారు. తాము అందజేస్తున్న బియ్యాన్ని పేదలు కడుపునిండా తిం టున్నారన్నారు. దశాబ్ద కాలంగా ఆగిపోయిన గంధమల్ల ప్రాజెక్టుకు రూ. 550కోట్లు మంజూ రు చేశామన్నారు. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ తమ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారావు, జడ్పీ సీఈవో శోభారా ణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు ఐనాల చైతన్య మహేందర్‌రెడ్డి, విమల వెంకటేశ్వర్‌ రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఉపేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు నీ లం పద్మ వెంకటస్వామి, కాంగ్రెస్‌ మండల, పట్టణ అధ్యక్షులు ఎజాజ్‌, వెంకటేశ్వర్‌ రాజు, నాయకులు గంధమల్ల అశోక్‌, సాగర్‌రెడ్డి, చింతల ఫణి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:11 AM