Share News

సమయపాలన పాటించకపోతే చర్యలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:13 AM

ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని, తప్పనిసరిగా సమ య పాటించాలని కలెక్టర్‌ హనుమంతరావు అ న్నారు. మంగళవారం ఆలేరు మండలం శారాజీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మంతపురిలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాన్ని ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సమయపాలన పాటించకపోతే చర్యలు

కలెక్టర్‌ హనుమంతరావు

ఆలేరు రూరల్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని, తప్పనిసరిగా సమ య పాటించాలని కలెక్టర్‌ హనుమంతరావు అ న్నారు. మంగళవారం ఆలేరు మండలం శారాజీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మంతపురిలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాన్ని ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రికార్డులు, హాజరు పట్టీని, ల్యాబ్‌ను, వాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు అన్నిరకాల వైద్య సేవలు అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలన్నారు.

అదేవిధంగా అన్నిరకాల మం దులు వాక్సిన్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నా రు. ఆలేరు పీ హెచ్‌సీలో టెక్నీషియన్లు లేక ప్రజ లు పడుతు న్న ఇబ్బందులపై డీఎంహెచ్‌వోతో మాట్లాడారు. ఆస్పత్రి ఆవరణలో ఎర్రమట్టిని పోయించి మొక్కలు పెంచేలా చూడాలని పం చాయితీ కార్యదర్శి స్వప్నను ఆదేశించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి భార్గవి, వెటర్నరీ డాక్టర్‌ పి.చైతన్య, రామ స్వామి సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

యాదగిరిగుట్ట రూరల్‌: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. మంగళవారం మండలంలోని వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. జల్లా కలెక్టర్‌ పాఠశాలలో మధ్యాన భోజనం పథకం కింద మెనూ ప్రకారం అందించే భోజనాన్ని స్వయంగా పరిశీలించి విద్యార్థులకు భోజనం వడించారు. విద్యార్థులకు సరిపడ భోజనం వంటచేశారా యని వంట కార్మికులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అర్ధమయ్యే విధముగా బోధించి వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులను బాగా చదివించి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతం పొందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రధానోపాద్యాయులు కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:13 AM