వ్యవసాయ శాఖ కార్యాలయంలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:44 AM
కోదాడ రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కోదాడలోని వ్యవసాయ కార్యాలయం స్లాబ్ సోమవారం అకస్మాత్తుగా స్లాబ్ పెచ్చులూడింది. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ విధంగా జరగడంతో భయంతో పరుగులు తీశారు.

భయంతో పరుగులు తీసిన సిబ్బంది
కోదాడ రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కోదాడలోని వ్యవసాయ కార్యాలయం స్లాబ్ సోమవారం అకస్మాత్తుగా స్లాబ్ పెచ్చులూడింది. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ విధంగా జరగడంతో భయంతో పరుగులు తీశారు. వ్యవసాయ కార్యాలయం ఇప్పటికే శిథిలావస్థకు చేరింది. సిబ్బంది భయం..భయంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై కథ నాలను ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే ప్రచురించింది. ప్రస్తుతం కోదాడ వ్యవసాయ శాఖ కార్యాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలోని రైతు విశ్రాంతి భవనంలో నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన గోదాంను ఓ వ్యక్తి ఆక్రమించి దర్జాగా అందులో ఇంటిని నిర్మించుకుని నివసిస్తున్నాడు. వ్యవసాయ శాఖ కార్యాలయం మాత్రం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని, ఈ భవనంలో విధులు నిర్వహించాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం నిధులు మంజూరు చేసి కొత్త భవనం నిర్మించాలని, లేనిచో అద్దె భవనంలో నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలని సూర్యాపేట కలెక్టర్‌కు సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
కోదాడ ఏడీఏ బదిలీ
సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ శాఖ ఏడీఏగా యల్లయ్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది ములుగు జిల్లాకు బదిలీ అయ్యారు. యల్లయ్య మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆయనకు పదోన్నతి కల్పించి బదిలీ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.