Hyderabad: మైనంపల్లి సంచలన కామెంట్స్.. భార్యాభర్తల ఏకాంత సంభాషణనూ ట్యాప్ చేశారు
ABN , Publish Date - Jun 30 , 2025 | 08:08 AM
భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడే ఫోన్లను సైతం ట్యాప్ చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.

హైదరాబాద్: భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడే ఫోన్లను సైతం ట్యాప్ చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Former MLA Mynampally Hanmantha Rao) అన్నారు. రహస్యంగా సంభాషణ విని వారి సంసారాలను విడగొట్టారని ఆయన ఆరోపించారు. దూలపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బీఆర్‌ఎస్ పార్టీలో ఉండగానే తన ఫోన్, కుటుంబసభ్యుల ఫోన్‌లను సైతం ట్యాప్ చేశారని మైనంపల్లి ఆరోపించారు.
అంతేకాకుండా జడ్జిల ఫోన్‌లను సైతం రికార్డింగ్ చేసి లొంగదీసుకున్న ఘనత కేసీఆర్, కేటీఆర్‌లదేనని ఆయన మండిపడ్డారు. ఓ న్యూస్ చానల్ కార్యాలయంపై బీఆర్‌ఎస్(BRS) వర్గీయులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. మీడియాపై దాడులు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలోనే ఈ తతంగం అంతా జరగాలన్నారు.
బీఆర్‌ఎస్ నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీ్‌షరావులకు ఇక మీదట నిద్రలేని రాత్రులు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దూలపల్లి వ్యవసాయ సహకార బ్యాంకు అధ్యక్షులు నరేందర్, కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్, ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్
Read Latest Telangana News and National News