Raghunandan Rao: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వండి
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:59 AM
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40 శాతం కోటా కేటాయించాలని ఎంపీ రఘునందన్‌రావు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

సీఎంకు ఎంపీ రఘునందన్ లేఖ
ఎంఐఎంకు లొంగిపోయిన హైడ్రా: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40 శాతం కోటా కేటాయించాలని ఎంపీ రఘునందన్‌రావు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. స్థానిక ఎమ్మెల్యేలకు ఇందులో ఇప్పటికే 40 శాతం కోటా కేటాయించారని, ప్రజల మద్దతుతో గెలిచిన ఎంపీలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పథకానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా అందుతున్నాయని గుర్తు చేశారు.
హైడ్రా.. ఎంఐఎంకు లొంగిపోయిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సల్కం చెరువు మధ్యలో కట్టిన అక్రమ భవనాలను కూల్చివేసేందుకు భయపడుతోందని అన్నారు. మానవత్వం అన్నది ముస్లింల విషయంలోనే వర్తిస్తుంది గానీ, హిందువుల విషయంలో ఎందుకు వర్తింపజేయరని రంగనాథ్‌ను నిలదీశారు. అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను తక్షణం పంపించాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు.