Kadiyam Kavya: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:32 AM
తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు.

పార్లమెంట్‌లో ఎంపీ కడియం కావ్య
న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యవస్థాపకత లక్ష్యంగా తీసుకొచ్చిన పథకాల వివరాలను తెలియజేయాలని సోమవారం లోక్‌సభలో కోరారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, పీఎంఈజీపీ, స్కిల్ ఇండియా మిషన్ వంటి జాతీయ పథకాలను తెలంగాణలో మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ కావ్య వినతికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానం ఇచ్చారు. రాష్ట్రీయ యువ స్వశక్తి కరణ్ కార్యక్రమ్, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఎంవై భారత్ వంటి కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు.